ప్లీజ్.. ఒక్క గంట ఆగండి.. పెళ్లయ్యాక నన్ను అరెస్ట్ చేసుకోండి.. పోలీసులను ఆ వరుడు వేడుకున్నా..
ABN , First Publish Date - 2022-12-17T18:15:06+05:30 IST
బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కళ్యాణ మంటపం కళకళలాడుతోంది. పొద్దునే వివాహం జరగాల్సి ఉండగా.. సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంటపంలోకి ఉన్నట్టుండి..
బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కళ్యాణ మంటపం కళకళలాడుతోంది. పొద్దునే వివాహం జరగాల్సి ఉండగా.. సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంటపంలోకి ఉన్నట్టుండి పోలీసులు రావడంతో అంతా షాక్ అయ్యారు. పోలీసులను గదిలోకి తీసుకెళ్లిన యువకుడు.. ‘‘ప్లీజ్.. ఒక్క గంట ఆగండి.. పెళ్లయ్యాక నన్ను అరెస్ట్ చేసుకోండి’’.. అంటూ వేడుకున్నాడు. అయినా పోలీసులు వినకుండా అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
హర్యానాలోని (Haryana) రోహ్తక్ పరిధికి చెందిన 17 ఏళ్ల బాలిక ఉంటున్న ప్రాంతానికి.. మూడు నెలల క్రితం జడ్చర్లకు చెందిన ఓ యువకుడు వచ్చాడు. ఆమె ఇంటి సమీపంలోనే గది తీసుకుని ఉండేవాడు. ఈ క్రమంలో తరచూ బాలికను గమనిస్తూ ఉండేవాడు. ఓ రోజు బాలిక ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి లోపలికి వెళ్లాడు. అకస్మాత్తుగా ఆమెను బలవంతం (Indecent behavior) చేయసాగాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొందంటూ హెచ్చరించాడు. అయితే కొన్నాళ్లకు బాలిక గర్భం దాల్చింది.
ఇదిలావుండగా, గురువారం యువకుడు వేరే యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. దీంతో బుధవారం పోలీసులను ఆశ్రయించి (Police complaint) ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి గ్రామానికి చేరుకున్నారు. పోలీసులను చూసి షాకైన యువకుడు.. వారిని వేరే గదిలోకి పిలుచుకెళ్లి బతిమాలుకున్నాడు. ‘‘ఈ పెళ్లి ఆగిపోతే పరువు పోతుంది.. ప్లీజ్ ఒక్క గంట ఆగండి.. తర్వాత అరెస్ట్ చేసుకోండి’’.. అని వేడుకున్నాడు. అయితే పోలీసులు ఇందుకు ససేమిరా అన్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన.. పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. చివరకు..