Viral Wedding Invitation: ప్రభాస్, అనుష్క పెళ్లిపై ఫన్నీ వీడియో.. అతిథులు ఎవరో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2022-12-14T20:25:59+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క పెళ్లికి సంబంధించి ఎంతో కాలంగా ఎన్నో వార్తలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తమ మధ్య అలాంటి..

Viral Wedding Invitation: ప్రభాస్, అనుష్క పెళ్లిపై ఫన్నీ వీడియో.. అతిథులు ఎవరో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Young rebelstar Prabhas), అనుష్క పెళ్లికి (Anushka marriage) సంబంధించి ఎంతో కాలంగా ఎన్నో వార్తలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తమ మధ్య అలాంటి ఉద్దేశం లేదని ప్రకటించినా.. ఈ టాపిక్ ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హోదాలో ఉండడంతో.. ప్రతి చిన్న వార్తా తెగ వైరల్ అవుతోంది. పైగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వీళ్ల పెళ్లి సంగతి ఏమో గానీ.. ప్రభాస్, అనుష్క పెళ్లి టాపిక్‌ని ప్రస్తావిస్తూ.. ఓ నెటిజన్ షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో (Funny videos) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది..

‘‘గంటల పిక్చర్స్.. నా పెళ్లి.. వరుడు ప్రభాస్.. అయితే ఆయన ఎలాగూ పెళ్లి చేసుకోలేదు కాబట్టి వరుడు ప్రతీక్, వధువు అనుష్క’’.

‘‘అయితే ఆమెను మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి... అధిర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు’’.

‘‘ముహూర్తం డిసెంబర్ 31.. అయితే ఆ సమయానికి ముహూర్తాలు ఉండవు కాబట్టి.. 8వ తేదీకి ఫిక్స్ అయ్యాం’’.

‘‘వేదిక ఉదయ్‌పూర్.. అయితే పేరులో పూర్ ఉంది కాబట్టి.. రిచ్‪‌గా థింక్ చేసి లోకల్ కన్వెన్షన్ సెంటర్‌లో పెట్టుకున్నాం’’.. అని అంటూనే పంతులుగా హీరో విష్ణు ఫొటోను చూపించడంతో పాటూ.. అతిథిగా చిరంజీవిని పిలిస్తే.. మ్యాటర్‌ని అందరికీ లీక్ చేస్తారనే ఉద్దేశంతో పిలవలేదంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదెక్కడి వెడ్డింగ్ ఇన్విటేషన్ రా.. నాయనా.. అంటూ కొందరు, ఫన్నీ ఫన్నీ ఇమేజ్‌తో మరికొందరు స్పందిస్తున్నారు.

Updated Date - 2022-12-14T20:26:06+05:30 IST