Innovative device: రేపిస్టులను షాక్ ఇచ్చేలా అద్భుత ఆవిష్కరణ చేసిన బాలిక.. అవి వాడితే ఇబ్బందులు ఉండవట..
ABN , First Publish Date - 2022-12-14T21:08:09+05:30 IST
రేపిస్టుల నుంచి మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఓ బాలిక అద్భుత ఆవిష్కరణ చేసింది. అవి వాడటం వల్ల అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో సులువుగా..
రేపిస్టుల నుంచి మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఓ బాలిక అద్భుత ఆవిష్కరణ చేసింది. అవి వాడటం వల్ల అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో సులువుగా తప్పించుకోవచ్చని చెబుతోంది. 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఈ ఆవిష్కరణకు పూనుకుని, అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఇంతకీ ఆమె తయారు చేసిన పరికరం ఏంటి, తద్వారా మహిళలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది.. అనే వివరాల్లోకి వెళితే..
Police Jobs: ఎత్తు కోసం నెత్తిన ఎమ్ సీల్ పెట్టుకున్న యువతి.. చివరకు పోలీసులకు ఎలా దొరికిందంటే..
కర్నాటకలోని (Karnataka) కల్బుర్గి ఎస్‌ఆర్‌ఎన్ మెహతా స్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని (Tenth class student) విజయలక్ష్మి బిరాదార్.. ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది, ఇది మహిళలపై దాడి నుంచి కాపాడుతుందని చెబుతోంది. అత్యాచార ఘటనలను అడ్డుకునేందుకు ఓ విజయలక్ష్మి.. అద్భుతమైన పాదరక్షలను తయారు చేసింది. 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె వీటికి రూపకల్పన చేసింది. బ్యాటరీల సాయంతో నడిచే ఈ పాదరక్షలతో (Footwear) రేపిస్టులతో పోరాడవచ్చట. నేరస్తులను కాలితో తన్నగానే దాని నుంచి విద్యుత్ ప్రవహిస్తుందని, తద్వారా వారి నుంచి తప్పించుకోవచ్చని బాలిక చెప్పింది. అలాగే ఈ పాదరక్షల్లో జీపీఎస్ ఫీచర్ (GPS system) కూడా ఉందట. తద్వారా లైవ్ లొకేషన్‌తో (Live location) పాటూ అందులో సేవ్ చేసిన నంబర్లకు ఫోన్ కూడా వెళుతుందని తెలిపింది. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్‌పోలో అవార్డును కూడా గెలుచుకున్నట్లు పేర్కొంది.