పాలు తాగుతున్న పసిబిడ్డను చెరువులోకి విసిరేసింది.. అంతటితో ఆగకుండా చివరకు..

ABN , First Publish Date - 2022-10-29T17:04:50+05:30 IST

మొన్నటిదాకా బాగున్న ఆ మహిళ ప్రవర్తనలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకుంది. అయినా భర్త, అత్తమామలకు ఎలాంటి అనుమానమూ రాలేదు. మనసు బాగోలేక అలా ఉందేమో.. కొన్నాళ్లు పోతే మారిపోతుందిలే.. అని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమె ఇలాంటి పని చేస్తుందని ఎవరూ ఊహించలేదు...

పాలు తాగుతున్న పసిబిడ్డను చెరువులోకి విసిరేసింది.. అంతటితో ఆగకుండా చివరకు..

మొన్నటిదాకా బాగున్న ఆ మహిళ ప్రవర్తనలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకుంది. అయినా భర్త, అత్తమామలకు ఎలాంటి అనుమానమూ రాలేదు. మనసు బాగోలేక అలా ఉందేమో.. కొన్నాళ్లు పోతే మారిపోతుందిలే.. అని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమె ఇలాంటి పని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పాలు తాగుతున్న పసిబిడ్డను చెరువులో విసిరేసిన ఆమె.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

దైవ దర్శనం కోసం వెళ్తుండగా.. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బారాబంకిలోని జైద్‌పూర్ పరిధి భానౌలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బబ్లూ, సీమ (35) దంపతులకు (couple) రెండేళ్ల కుమార్తె ఉంది. వివాహమైన మొదట్లో బాగున్న సీమ ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ.. ఏకాంతంగా ఉంటోంది. అయినా భర్త, అత్తమామలకు ఎలాంటి అనుమానమూ కలగలేదు. ఏదో ఆలోచిస్తోందిలే అని అనుకున్నారు. ఈ క్రమంలో గురువారం సీమ తన కుమార్తెతో పాటూ రాంపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. తర్వాత కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లారు. ఆ సమయంలో కుమార్తెతో పాటూ సీమ ఒక్కటే ఇంట్లో ఉంది.

భర్త వీడియో తీస్తుండగా.. భార్య షాకింగ్ నిర్ణయం.. చివరకు బంధువుల రాకతో..

ఈ క్రమంలో ఉన్నట్టుండి సీమ విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టింది. కాసేపటి తర్వాత పాలు తాగుతున్న కుమార్తెను ఎత్తుకెళ్లి చెరువులో పడేసింది. తర్వాత ఇంటికి వచ్చి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటి వరకూ బాగున్న సీమ.. ఉన్నట్టుండి ఇలా ఉరి వేసుకోవడాన్ని తల్లిదండ్రులతో పాటూ స్థానికులూ జీర్ణించుకోలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం చెరువులో తేలియాడుతున్న చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీమ మానసిక పరిస్థితి (Mental disability) సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

ఇంట్లో వారితో పాటూ పక్కింటి వ్యక్తికీ టీ ఇచ్చింది.. అమె చేసిన చిన్న పొరపాటుకు..

Updated Date - 2022-10-29T17:04:56+05:30 IST