దున్నపోతు తల సైకిల్‌లో ఇరుక్కుపోయిందిలా..

ABN , First Publish Date - 2022-10-27T15:47:08+05:30 IST

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో (Uttar Pradesh, Agra) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మార్కెట్‌లోని కూరగాయల దుకాణాల వద్ద సైకిళ్లు, వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. అక్కడ కిందపడేసిన కూరగాయలను తినేందుకు ఓ దున్నపోతు అక్కడికి వస్తుంది. కూరగాయలను తినే క్రమంలో సైకిల్ మధ్యలో తల ఇరుక్కుపోతుంది. దీంతో ..

దున్నపోతు తల సైకిల్‌లో ఇరుక్కుపోయిందిలా..

కాస్త వినూత్నంగా ఉండే చిన్న చిన్న సంఘటనలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో జరిగినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ (Viral videos) అయిపోతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇంకొన్ని వీడియోలు షాక్‌కు గురి చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఓ దున్నపోతుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆగ్రాలో ఓ దున్నపోతు మేత మేసే క్రమంలో పొరపాటున దాని తల సైకిల్‌ మధ్యలో ఇరుక్కుపోతుంది. దాని నుంచి బయటపడే క్రమంలో నానా బీభత్సం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో (Uttar Pradesh, Agra) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మార్కెట్‌లోని కూరగాయల దుకాణాల వద్ద సైకిళ్లు, వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. అక్కడ కిందపడేసిన కూరగాయలను తినేందుకు ఓ దున్నపోతు అక్కడికి వస్తుంది. కూరగాయలను తినే క్రమంలో సైకిల్ మధ్యలో తల ఇరుక్కుపోతుంది. దీంతో దాని నుంచి విడిపించుకునేందుకు నానా బీభత్సం చేస్తుంది. దానికి సాయం చేయాని స్థానికులు ప్రయత్నించినా.. ఎక్కడ తమ మీద దాడి చేస్తుందో అన్న భయంతో దగ్గరిపోయేందుకు సాహసించరు.

Viral Video: వృద్ధురాలి పట్ల ఈ కుక్క పిల్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

సైకిల్ మధ్య నుంచి విడిపించుకునే క్రమంలో దున్నపోతు.. అటూఇటూ పరుగులు పెడుతంది. అయినా తల మాత్రం బయటికి రాదు. ఈ క్రమంలో వేగంగా వెళ్లి ఓ గోడ వద్ద ఆగిపోతుంది. అప్పటికే అలసిపోయి ఉండడంతో అలాగే పడుకుండిపోతుంది. ఇలా చాలా సేపటి తర్వాత.. స్థానికులు కలుగజేసుకుని అతి కష్టం మీద సైకిల్‌ను పక్కకు తొలగిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఇంట్లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. గాజు బాక్సు మూత తీయడంతో ఒక్కసారిగా ఏం చేసిందో చూడండి..

Updated Date - 2022-10-27T16:58:24+05:30 IST