Viral Video: జనాల పైకి దూసుకొచ్చిన కారు.. ఎంత బీభత్సం సృష్టించిందో చూడండి..

ABN , First Publish Date - 2022-11-22T21:32:16+05:30 IST

కొన్నిసార్లు ఉన్నట్టుండి చోటు చేసుకునే షాకింగ్ ఘటనల వల్ల.. ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. మరికొన్ని సార్లు కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఎక్కడెక్కడో జరిగే ఇలాంటి..

Viral Video: జనాల పైకి దూసుకొచ్చిన కారు.. ఎంత బీభత్సం సృష్టించిందో చూడండి..

కొన్నిసార్లు ఉన్నట్టుండి చోటు చేసుకునే షాకింగ్ ఘటనల వల్ల.. ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంటుంది. మరికొన్ని సార్లు కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఎక్కడెక్కడో జరిగే ఇలాంటి చిన్న చిన్న ఘటనలు కూడా మారుమూల ప్రాంతాల వరకూ చేరిపోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. జనాలపై దూసుకురావడంతో చివరకు విషాద ఘటన చోటు చేసుకుంది..

భార్యను ముళ్ల పొదల మధ్యలోకి తీసుకెళ్లిన భర్త.. కాసేటికి స్థానికులు వెళ్లి చూడగా..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. హర్యానా గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం వేకువజామున 2గంటల ప్రాంతంలో ఉద్యోగ్ విహార్ అనే ప్రాంతంలో స్థానికులు కొందరు రోడ్డుపై ఉన్నారు. అయితే అదే సమయంలో ఓ కారు అతి వేగంగా వారి వైపు వచ్చింది. కారును గమనించిన కొందరు పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అంతలోనే దూసుకొచ్చిన కారు (car accident) వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేసి రెండు కార్లను సీజ్ చేశారు. ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అని, ముగ్గురు ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: కోతితో బాక్సింగ్ ఆడాలని చూసిన బాలుడికి.. ఎలా బుద్ధి చెప్పిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - 2022-11-22T21:32:20+05:30 IST