Viral Video: బస్సును వెనుక నుంచి ఫాలో అయిన వ్యాన్ డ్రైవర్.. బస్సు తోలుతూ డ్రైవర్ చేస్తున్న పని చూసి..
ABN , First Publish Date - 2022-12-18T20:37:12+05:30 IST
కొందరు బాధ్యత గల ఉద్యోగాలు చేస్తూ.. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. మరికొందరు విధుల్లో ఉండగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి..
కొందరు బాధ్యత గల ఉద్యోగాలు చేస్తూ.. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. మరికొందరు విధుల్లో ఉండగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న ఇతను.. డ్రైవింగ్ సమయంలో బాధ్యత మరిచి ప్రవర్తించాడు. వెనుకే వస్తున్న వ్యాన్ డ్రైవర్ బస్సును ఫాలో అయ్యాడు. చివరకు బస్సు డ్రైవర్ చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ బస్సు వేగంగా వెళ్తుంటుంది. అయితే వెనుక వస్తున్న వ్యాన్ డ్రైవర్‌కు.. ఎందుకో బస్సు డ్రైవర్‌పై (Bus driver) అనుమానం వస్తుంది. దీంతో వేగంగా బస్సును ఫాలో అవుతాడు. చివరకు బస్సును ఓవర్‌టేక్ చేసి చేస్తాడు. అయితే బస్సు డ్రైవర్ ఓ వైపు డ్రైవింగ్ చేస్తూనే, మరోవైపు హుక్కా (hookah) తాగుతూ ఉంటాడు. గుప్పు గుప్పున పొగ పీలుస్తూ.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం (Reckless driving) చూసి వ్యాన్ డ్రైవర్ షాక్ అవుతాడు. డ్రైవర్‌ని పిలిచి.. బండి తోలుతూ ఏంటా పని అంటూ హెచ్చరిస్తాడు. అయినా బస్సు డ్రైవర్ మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్ల వల్లే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయంటూ మండిపడుతున్నారు.