Viral Video: లేటు వయసులోనూ ఈ బామ్మ వేసిన లేటెస్ట్ స్టెప్పులకు.. నెటిజన్లు ఫిదా..

ABN , First Publish Date - 2022-10-30T18:45:57+05:30 IST

కొందరి దృష్టిలో వయసు కేవలం సంఖ్య మాత్రమే.. వారి ప్రవర్తనలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. వయసు మీద పడుతున్నా.. వారి ఆలోచనలు, ప్రవర్తన మాత్రం యువతతో పోటీ పడే విధంగా ఉంటుంది. వృద్ధులు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఎప్పుడూ ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వృద్ధురాలు..

Viral Video: లేటు వయసులోనూ ఈ బామ్మ వేసిన లేటెస్ట్ స్టెప్పులకు.. నెటిజన్లు ఫిదా..

కొందరి దృష్టిలో వయసు కేవలం సంఖ్య మాత్రమే.. వారి ప్రవర్తనలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. వయసు మీద పడుతున్నా.. వారి ఆలోచనలు, ప్రవర్తన మాత్రం యువతతో పోటీ పడే విధంగా ఉంటుంది. వృద్ధులు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఎప్పుడూ ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వృద్ధురాలు లేటు వయసులో వేసిన.. లేటెస్ట్ స్టెప్పులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో (Dance videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వీడేంట్రా.. ఏకంగా సింహానికే పాలు పడుతున్నాడు.. చూస్తే ఖచ్చితంగా షాకవుతారు..

ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram viral videos) ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘కిసీ డిస్కో మే జాయే' అనే హిందీ పాటకు ఓ వృద్ధురాలు (old woman) వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నటుడు గోవిందా, రవీనా టాండన్ (Govinda, Ravinatandon) నటించిన బడే మియాన్ చోటే మియాన్ చిత్రంలోని (Bade Mian Chote Mian movie) హిట్ పాటకు.. ఆమె లయబద్ధంగా స్టెప్పులు వేస్తుంది. ఎక్కడా తన వయసు కనబడకుండా అచ్చం యువకుల్లా డ్యాన్స్ వేసి, అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘సమస్యలు ఉన్న వారు.. ఈ బామ్మను ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘వావ్! బామ్మా.. నువ్వు సూపర్’’.. అంటూ మరికొందరు, "మేడమ్ యూ ఆర్ వెరీ స్వీట్ అండ్ టాలెంటెడ్.. గాడ్ బ్లెస్ యూ".. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

గట్టిగా అరవద్దంటూ విద్యార్థినికి రూ.10లు ఇచ్చిన టీచర్.. బాలిక ఇంటికి వెళ్లిన రెండు రోజుల తర్వాత..

Updated Date - 2022-11-02T00:47:16+05:30 IST