వాకింగ్ చేస్తుండగా గుండెపోటు.. నడిరోడ్డు మీదే పడిపోయిన వృద్ధుడు.. ఈ పోలీసమ్మే లేకుంటే..!
ABN , First Publish Date - 2022-12-13T19:27:50+05:30 IST
అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు.. కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు..
అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు.. కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ 61ఏళ్ల వృద్ధుడికి వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో నడి రోడ్డుపై పడిపోయాడు. అయితే సడన్‌గా ఓ మహిళా పోలీసు గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Gold Stock End’s: బంగారానికి వార్నింగ్ బెల్స్.. 20 ఏళ్ల తర్వాత బంగారం కనిపించదు..!?
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ పరిధి గోలే మందిర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రివర్ వ్యూ కాలనీకి చెందిన 61ఏళ్ల అనిల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి విద్యుత్ కంపెనీలో పని చేస్తూ రిటైర్డ్ అయ్యాడు. ఇదిలావుండగా, సోమవారం ఉదయం అనిల్ వాకింగ్‌రీ బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో అతడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో సడన్‌గా కిందపడిపోయాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన సోనమ్ అనే మహిళా ఎస్ఐ (Female SI) అతడిని గమనించింది. వెంటనే అప్రమత్తమై అతడికి సీపీఆర్ (Cardiopulmonary resuscitation) చేసింది.
డాక్టర్ అయి ఉండి ఇదేం పాడు బుద్ధి.. అర్ధరాత్రిళ్లు ఫుట్‌పాత్‌ల వద్దకు వెళ్లి మరీ..
దీంతో కాసేపటికి అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం అనిల్ కుమారుడికి సమాచారం అందించడంతో పాటూ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 2016 బ్యాచ్‌కి చెందిన ఎస్ఐ సోనమ్.. పోలీసుల శిక్షణలో భాగంగా సీపీఆర్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నట్లు చెప్పారు. తన కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు. సరైన సమయంలో స్పందించి, మానవత్వంతో వ్యవహరించిన సోనమ్‌ను అంతా అభినందలతో ముంచెత్తుతున్నారు.
మసాజర్ కోసం వెతుకుతుండగా.. ఆన్‌లైన్‌లో కనిపించిన భార్య ఫొటోలు.. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా...