WhatsApp Video call: వాట్సప్ కాల్‌ను లిఫ్ట్ చేయడమే అతడి పాలిట శాపమైంది.. రూ.63 వేలు పోయినా..
ABN , First Publish Date - 2022-11-24T18:37:07+05:30 IST
ఫోన్‌లో అమ్మాయి వాయిస్ వినబడిందంటే చాలు.. చాలా మంది యువకులు తమని తామే మర్చిపోతుంటారు. అవతలి వారిని ఏమాత్రం..
ఫోన్‌లో అమ్మాయి వాయిస్ వినబడిందంటే చాలు.. చాలా మంది యువకులు తమని తామే మర్చిపోతుంటారు. అవతలి వారిని ఏమాత్రం అంచనా వేయకుండా.. వారు చెప్పినట్లు చేసుకుపోతుంటారు. ఇలాంటి వారి బలహీనతలను చాలా మంది అవకాశంగా తీసుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే అటువైపు ఓ అందమైన యువతి కనిపించిది. ఆమెతో మాట్లాడటమే అతడి పాలిట శాపమైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ముగ్గురి ప్రాణాలు తీసి, మూడు నెలలుగా హడలెత్తించిన చిరుత.. ఎట్టకేలకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో పరిధి ఘాజీపూర్ కొత్వాలిలో నివాసం ఉంటున్న 30ఏళ్ల వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. ఇటీవల అతడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్ వీడియో కాల్ (WhatsApp video call) వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అటు వైపు నుంచి ఓ మహిళ (woman) అర్ధనగ్నంగా కనిపించింది. దీంతో యువకుడు ఆమెతో మాటలు కొనసాగించాడు. కాసేపటికే ఆమె పూర్తి నగ్నంగా మారిపోయింది. అలాగే యువకుడిని కూడా దుస్తులు విప్పమని చెప్పింది. ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడుకున్న తర్వాత.. ఉన్నట్టుండి కాల్ కట్ అయింది. అంతలోనే మరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.
యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..
అవతలి వ్యక్తి తనను తాను పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘‘నీ అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి’’.. అని చెబుతూ వాటిని తొలగించేందుకు బేరసారాలు సాగించాడు. ఇలా పలుమార్లు బెదిరింపులకు పాల్పడి.. మొత్తం రూ.63వేలు తమ ఖాతాలో వేయించకున్నారు. అయితే అంతటితో ఆగకుండా మళ్లీ మళ్లీ నగదు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలెట్టారు. దీంతో బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కూతురిని చంపి సూట్‌కేసులో పెట్టి పారేసిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. 10 రోజుల క్రితమే..