స్నేహితుడి ప్రియురాలిపై మనుసులో మాటను బయటపెట్టాడు.. అలా మాట్లాడొద్దని అనడంతో..

ABN , First Publish Date - 2022-10-29T19:14:54+05:30 IST

ప్రేమ విషయంలో తలెత్తే గొడవలు చివరకు చాలా దూరం వెళ్తుంటాయి. ఇక ప్రియురాలి విషయంలో యువకుల మధ్య తలెత్తే గొడవలు.. చివరకు హత్యలు ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం, ఒకరి ప్రియురాలి పట్ల ఇంకొకరు అసభ్యరంగా ప్రవర్తించడం తదితర ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. ఢిల్లీలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడు ..

స్నేహితుడి ప్రియురాలిపై మనుసులో మాటను బయటపెట్టాడు.. అలా మాట్లాడొద్దని అనడంతో..

ప్రేమ విషయంలో తలెత్తే గొడవలు చివరకు చాలా దూరం వెళ్తుంటాయి. ఇక ప్రియురాలి విషయంలో యువకుల మధ్య తలెత్తే గొడవలు.. చివరకు హత్యలు ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం, ఒకరి ప్రియురాలి పట్ల ఇంకొకరు అసభ్యరంగా ప్రవర్తించడం తదితర ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. ఢిల్లీలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడు తన స్నేహితుడి ప్రియురాలి గురించి హేళనగా మాట్లాడాడు. అలా మాట్లాడొద్దు అని స్నేహితుడు అన్నందుకు.. చివరకు దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పాలు తాగుతున్న పసిబిడ్డను చెరువులోకి విసిరేసింది.. అంతటితో ఆగకుండా చివరకు..

ఢిల్లీ (Delhi) పరిధి ఆదర్శ్ నగర్ పరిధి లాల్ బాగ్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అర్మాన్, సబీర్ అనే యువకులు స్నేహితులు. సబీర్‌కు అప్పటికే ఓ ప్రియురాలి ఉండేది. ఈ విషయం అర్మాన్‌కు కూడా తెలుసు. అయితే అతడి మనసులో సబీర్ ప్రియురాలి (girlfriend) గురించి ఏముందో ఏమో తెలీదు గానీ.. స్నేహితుడి ముందు ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ అక్టోబర్ 27న రాత్రి ఇద్దరూ నిర్మాణుష్య ప్రదేశంలో కలిశారు. ఈ సమయంలో అనుకోకుండా సబీర్ ప్రియురాలి ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో అర్మాన్.. సబీర్ ప్రియురాలి పట్ల హేళనగా మాట్లాడాడు.

ఇంట్లో వారితో పాటూ పక్కింటి వ్యక్తికీ టీ ఇచ్చింది.. అమె చేసిన చిన్న పొరపాటుకు..

దీంతో.. ‘‘నా ప్రియురాలిని అలా అనొద్దు అంటూ సబీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మాటతో ఉన్నట్టుండి కోపంతో ఊగిపోయిన అర్మాన్.. స్నేహితుడు అని కూడా చూడకుండా సబీర్‌పై కత్తితో దాడికి (attack) దిగాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సబీర్‌ను స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సబీర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టతరమైంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: యువతి సాయం చేయగానే.. చివర్లో ఏనుగు ఎక్స్‌ప్రెషన్ చూడండి..

Updated Date - 2022-10-29T19:14:59+05:30 IST