వీడిని ఏమనాలి.. అలా శృంగారం చేయొద్దన్నందుకు బరితెగించి మరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత చూస్తే..

ABN , First Publish Date - 2022-12-24T16:36:24+05:30 IST

పచ్చని సంసారాన్ని కొందరు తమ పైశాచికత్వంతో పాడు చేసుకుంటూ ఉంటారు. తెలిసి తెలిసి భర్తకు భార్య, భార్యకు భర్త.. ఇబ్బందులు సృష్టించుకుని మరీ గొడవలకు కారణమవుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఇలాగే..

వీడిని ఏమనాలి.. అలా శృంగారం చేయొద్దన్నందుకు బరితెగించి మరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

పచ్చని సంసారాన్ని కొందరు తమ పైశాచికత్వంతో పాడు చేసుకుంటూ ఉంటారు. తెలిసి తెలిసి భర్తకు భార్య, భార్యకు భర్త.. ఇబ్బందులు సృష్టించుకుని మరీ గొడవలకు కారణమవుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఇలాగే భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అలా శృంగారం చేయొద్దన్నందుకు.. బరితెగించి ప్రవర్తించాడు. అతడి చిత్రహింసలను తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తర్వాత ఏం జరిగిందంటే..

Viral Video: కొడుకంటే ఇలా ఉండాలి.. ప్రమాదంలో ఉన్న తల్లిని ఎలా కాపాడాడో చూడండి..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ ఎంజీ రోడ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహిళకు ముంబైకి చెందిన అభిషేర్ నిగమ్ అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం (marriage) వివాహమైంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. అత్తగారి ఊరికి వెళ్లిన కొత్తలో భర్త.. బాగానే చూసుకున్నాడు. అయితే నెలలు గడిచే కొద్దీ అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యతో అసహజ పద్ధతిలో శృంగారం (Unnatural romance) చేసేందుకు ప్రయత్నించాడు. ఇలా చేయడం తనకు ఇష్టం లేదని చెబుతున్నా.. బలవంతంగా చేయసాగాడు. కొన్ని నెలలకు భర్తపై విరక్తి చెంది.. ఇండోర్‌కు వచ్చి ఏకాంతంగా జీవించడం మొదలెట్టింది.

Viral Video: నెమలిలో ఇంత ఆవేశాన్ని ఎప్పుడూ చూసుండరు.. గుడ్లను ఎత్తుకెళ్తున్న యువతిని ఏం చేసిందో చూడండి..

అయితే అంతటితో ఆగని భర్త.. ఇటీవల భార్య వద్దకు వచ్చి ఉంటున్నాడు. మళ్లీ అలాగే శృంగారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో చివరకు ఏం చేయాలో తెలీక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు (Police investigation) ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త.. విదేశాలకు పారిపోయాడు. అయినా పోలీసులు అతడి గురించి ఫోన్ నంబర్ ఆధారంగా అన్వేషిస్తూ వచ్చారు. ఇటీవల నిందితుడు ఇండియాకు వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. ముంబైలో కాపుకాశారు. రాగానే అదుపులోకి తీసుకుని ఇండోర్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు నెలలుగా పుట్టింట్లో ఉన్న భార్య.. సడన్‌గా అక్కడికి వెళ్లిన భర్త..

Updated Date - 2022-12-24T16:40:11+05:30 IST