Nails Biting: గోర్లను కొరికే అలవాటుందా..? ఈ జబ్బు వస్తుందని తెలిస్తే..

ABN , First Publish Date - 2022-12-01T17:34:24+05:30 IST

గోర్లను కొరికే అలవాటు.. (Nail biting habit) పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మందిలో ఉంటుంది. ఏమీ తోచని సమయంలో కొందరు, కంగారుగా ఉన్న సమయంలో మరికొందరు.. అదే పనిగా పదే పదే గోర్లను కొరికేస్తుంటారు. ఇంకొందరు..

Nails Biting: గోర్లను కొరికే అలవాటుందా..? ఈ జబ్బు వస్తుందని తెలిస్తే..

గోర్లను కొరికే అలవాటు.. (Nail biting habit) పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మందిలో ఉంటుంది. ఏమీ తోచని సమయంలో కొందరు, కంగారుగా ఉన్న సమయంలో మరికొందరు.. అదే పనిగా పదే పదే గోర్లను కొరికేస్తుంటారు. ఇంకొందరు ఈ అలవాటును మానుకోవాలని ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాకుండా ఉంటుంది. గోళ్లలో అనేక రకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. నోట్లో పెట్టకోవడం వల్ల అవి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా అనేక రకాల వ్యాధులకు శరీరం నిలయంగా మారుతుంది. అందుకే ఈ అలవాటును వెంటనే మానుకోవడం ఉత్తమమని వైద్యులు (Doctors) హెచ్చరిస్తున్నారు.

Viral Video: పేరుకే వృద్ధుడు.. ఇతడి విన్యాసాలు చూశారంటే.. ఖంగుతింటారు..

గోళ్లలో సాల్మొనెల్లా, ఈ.కొలి వంటి ప్రాణాంతక వ్యాధికారక బ్యాక్టీరియా (pathogenic bacteria) ఉంటుంది. వాటిని కొరకడం వల్ల సులభంగా నోటి ద్వారా శరీరంలోకి వెళ్తాయి. తద్వారా పలు రకాల వ్యాధులు చుట్టుముడతాయి. గోర్లు కొరికే అలవాటు వల్ల ప్రధానంగా దంతాల మీద చెడు ప్రభావం ఉంటుంది. తద్వారా దంతాలు బలహీనపడే ప్రమాదం ఉంటుందట. అదేవిధంగా గోళ్లలో ఉండే బ్యాక్టీరియా పేగుల్లోకి చేరడం వల్ల కేన్సర్ (Cancer disease) వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉంటుందట. కొన్నిసార్లు ఈ అలవాటు వల్ల డెర్మాటోఫాగియా అనే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల చర్మంపై గాయాల ఏర్పడటంతో పాటూ నరాల మీద కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుందట.

Dual Sim Cards: ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్‌కు శుభం కార్డు పడబోతోందా..?

nails3.jpg

ఈ అలవాటు వల్ల గోర్ల పెరుగుదలకు సహాయపడే కణజాలం దెబ్బతింటుంది. అదేవిధంగా దవడలో కూడా ఇన్ఫెక్షన్ (Infection) వస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ అలవాటను మానుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మౌత్ గార్డ్ వాటడం ద్వారా ఈ అలవాటు నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా గోళ్లపై చేదు పదార్థాలను రాసుకోవడం వల్ల కూడా నోట్లో పెట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. తరచూ గోళ్ల సైజును తగ్గిస్తూ ఉండాలి. అప్పుడు కొరికే అవసరం లేకుండా ఉంటుంది. కొందరు మానసిక ఒత్తిడి కారణంగా గోర్లు కొరకడం అలవాటుగా చేసుకుంటుంటారు. అలాంటి వారు.. యోగా, ప్రాణాయామం సాధన చేయడం వల్ల ఆ అలవాటు నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

తండ్రి మరణానికి ప్రతీకారంగా యువకుడిని ప్రేమించిన కుమార్తె.. ప్రియుడితో కలిసి మరో యువతికి తన దస్తులు వేసి మరీ..

Updated Date - 2022-12-01T17:34:29+05:30 IST