ఉదయాన్నే పక్కింటికి వెళ్లిన పదేళ్ల బాలుడు.. రాత్రి ప్రియుడితో కలిసి తన తల్లి చేసిన నిర్వాకం గురించి చెప్పడంతో..
ABN , First Publish Date - 2022-11-01T17:47:15+05:30 IST
వివాహేతర సంబంధాలకు అలవాటు పడి.. చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకునే ఉదంతాలు ఇటీవల ఎక్కడో చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సంతోషంగా సాగే సంసారాన్ని చేజేతులా సమస్యల వలయంగా మార్చుకుంటున్నారు. భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు... చివరకు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా..
వివాహేతర సంబంధాలకు అలవాటు పడి.. చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకునే ఉదంతాలు ఇటీవల ఎక్కడో చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సంతోషంగా సాగే సంసారాన్ని చేజేతులా సమస్యల వలయంగా మార్చుకుంటున్నారు. భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు... చివరకు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉదయాన్నే పక్కింటికి పరుగెత్తుకుంటూ వెళ్లిన పదేళ్ల బాలుడు.. రాత్రి ప్రియుడితో కలిసి తన తల్లి చేసిన దారుణం గురించి చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Viral Video: కళ్యాణ మంటపంపై వధువు ఎదుట ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం.. ఓపికతో భరించిన వరుడు.. చివరకు..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో పరిధి మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రదీప్, జ్యోతి దంపతులకు 11ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రదీప్ మొదట్లో రిక్షా నడుపేవాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల జ్యోతికి వరుసకు తమ్ముడు అయ్యే రంగోలి సింగ్ అనే వ్యక్తి.. తరచూ ప్రదీప్ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తకు తెలీకుండా తరచూ అతడితో కలుస్తూ ఉండేది. అయితే ఇటీవల వీరి విషయం ప్రదీప్‌కు తెలిసింది. పద్ధతిగా ఉండాలంటూ భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె మాత్రం రంగోలిని కలుస్తూ ఉండేది. దీంతో ఈ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు (quarrels) జరిగేవి.
గట్టిగా అరవద్దంటూ విద్యార్థినికి రూ.10లు ఇచ్చిన టీచర్.. బాలిక ఇంటికి వెళ్లిన రెండు రోజుల తర్వాత..
ఎంత చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొన్ని నెలల క్రితం ఆమెను బయటికి గెంటేశాడు. దీంతో అప్పటినుంచి జ్యోతి తన ప్రియుడు రంగోలితో కలిసి ఉండేది. అయితే ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్రపన్నారు. ఆదివారం రాత్రి ప్రదీప్ ఇంటికి చేరుకుని కావాలనే గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో రంగోలి ఒక్కసారిగా ప్రదీప్‌పై దాడి చేసి, హత్య చేశారు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారు. తండ్రిని తన కళ్లెదుటే చంపడాన్ని చూస కొడుకు ఆర్యన్.. భయపడిపోయాడు. రాత్రంతా భయతో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఉదయాన్నే పరుగెత్తుకుంటూ పక్కింటికి వెళ్లి.. రాత్రి జరిగిన దారుణాన్ని తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు రంగోలి కోసం గాలిస్తున్నారు.
వివాహ వేదికపై వధువుకు పురిటినొప్పులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరుడు.. చివరకు ఆస్పత్రిలో..