ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తున్న భార్య.. అనుమానం పెంచుకున్న భర్త.. ఓ రోజు అర్ధరాత్రి..

ABN , First Publish Date - 2022-12-18T18:21:08+05:30 IST

ఆమె కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తూ ఉండేది. విధుల్లో భాగంగా ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తూ ఉండేది. అప్పుడప్పుడూ బయటి ప్రాంతాలకు వెళ్తుండేది. తోటి ఉద్యోగులతో చనువుగా ఉండడాన్ని చూసి..

ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తున్న భార్య.. అనుమానం పెంచుకున్న భర్త.. ఓ రోజు అర్ధరాత్రి..
ప్రతీకాత్మక చిత్రం

ఆమె కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తూ ఉండేది. విధుల్లో భాగంగా ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తూ ఉండేది. అప్పుడప్పుడూ బయటి ప్రాంతాలకు వెళ్తుండేది. తోటి ఉద్యోగులతో చనువుగా ఉండడాన్ని చూసి భర్త భరించలేకపోయాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఓ రోజు అర్ధరాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆమెతో గొడవపడ్డాడు. చివరకు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ఇద్దరు పిల్లల తల్లి అదృశ్యం.. మీదే తప్పంటూ మామ, అల్లుడి మధ్య గొడవ.. 32 రోజుల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) బర్వానీ పరిధి కుందన్ నగర్‌లో దేవేంద్ర గుర్జార్, లీనా దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. దేవేంద్ర భార్య లీనా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంటుంది. అయితే విధుల్లో భాగంగా ఎక్కువగా నైట్ డ్యూటీలు ఉండేవి. అలాగే తరచూ వివిధ ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి వచ్చేది. ఇంతవరకూ దంపతుల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల దేవేంద్ర.. తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. విధుల్లో తోటి ఉద్యోగులతో చనువుగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ‘‘రాత్రి వేళ ఇంత సేపు ఏం చేస్తున్నావ్, ఎవరితో తిరుగుతున్నావ్’’.. అంటూ వేధించేవాడు.

women.jpg

అర్ధరాత్రి పహారా కాస్తున్న జవాను.. రోడ్డు పక్కన పడుకున్న వారిని పరిశీలించి.. చివరకు..

తాను ఎలాంటి తప్పూ చేయలేదని చెబుతున్నా రోజూ వేధించేవాడు. ఇటీవల ఆమె విధుల నిమిత్తం బయటి ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లాల్సి వచ్చింది. దీంతో దేవేంద్రకు అనుమానం మరింత బలపడింది. ఈ విషయమై శనివారం రాత్రి భార్యతో (quarrels) గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తీవ్ర ఆగ్రహానికి గురైన దేవేంద్ర.. పక్కనున్న గొడ్డలి తీసుకుని భార్య తలను నరికేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దేవేంద్రను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. లీనా హత్యతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

నా పేరు సోనూ సింగ్.. అని చెప్పడంతో ప్రేమలో పడిన వివాహిత.. తీరా అతడి ఇంటికి వెళ్లిన ఆమెకు.. అసలు విషయం తెలిసి..

Updated Date - 2022-12-18T18:21:20+05:30 IST