హాస్టల్‌లో ఉంటున్న బాలికతో యువకుడి ప్రేమాయణం.. పరువు పోతుందనే కారణంతో ఎవరికీ చెప్పకుండా ఒక రోజంతా గదిలో..

ABN , First Publish Date - 2022-12-21T21:17:30+05:30 IST

కొందరు బాలికలు మాయమాటలు నమ్మి.. చివరకు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. చదువును సైతం పక్కన పెట్టి పెడదోవ పడుతున్నారు. చివరకు పరువుపోతుందనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడుతుంటారు. మధ్యప్రదేశ్‍‌లో..

హాస్టల్‌లో ఉంటున్న బాలికతో యువకుడి ప్రేమాయణం.. పరువు పోతుందనే కారణంతో ఎవరికీ చెప్పకుండా ఒక రోజంతా గదిలో..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు బాలికలు మాయమాటలు నమ్మి.. చివరకు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. చదువును సైతం పక్కన పెట్టి పెడదోవ పడుతున్నారు. చివరకు పరువుపోతుందనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడుతుంటారు. మధ్యప్రదేశ్‍‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని.. ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలీకుండా ప్రేమాయణం సాగించారు. చివరకు పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా ఇటీవల ఇద్దరూ దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..

కారు పక్కన ఫొటోలు దిగుతున్న ఇద్దరు కుర్రాళ్లు.. యజమాని చూసి ఏం చేశాడో అస్సలు ఊహించలేరు..!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) షాహదోల్ పరిధిలోని ఓ బాలికల హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువకుడికి.. హాస్టల్‌లో ఉంటూ 12వ తరగతి చదువుతున్న బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా తరచూ ఇద్దరూ కలుసుకునేవారు. అప్పుడప్పుడూ యువకుడు హాస్టల్ గదిలోకి కూడా వెళ్లి వస్తుండేవాడు. అయితే ఈ క్రమంలో బాలిక గర్భం (pregnant girl) దాల్చింది. అయినా ఎవరికీ తెలీకుండా అలాగే ఉండిపోయింది. నవంబర్ 18న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

రాత్రి వేళ భర్త ప్రియురాలి ఇంటికి.. పరాయి వ్యక్తితో కలిసి వెళ్లిన భార్య.. ఊహించని విధంగా..

బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఒక రోజంతా శిశువును హాస్టల్ గదిలోనే ఉంచారు. మరుసటి రోజు రాత్రి శిశువును హత్య చేసి, హాస్టల్ ఆవరణలో ఉన్న చెత్తకుండీలో పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల బాలిక, యువకుడి ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. కాగా, హాస్టల్‌లో విద్యార్థినికి ఎవరు ప్రసవం చేశారు, ఈ విషయం హాస్టల్ నిర్వాహకులు ఎందుకు దాచి పెట్టారు, ఈ విషయంలో ఎవరెవరు సహాయసహకారాలు అందించారు.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కండక్టర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ భార్య.. ఇటీవల 200కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భర్త.. భార్య బస్సు ఎక్కి..

Updated Date - 2022-12-21T21:17:37+05:30 IST