దృశ్యం2 సినిమాను రెండు సార్లు చూసి.. ఇంటికొచ్చి య్యూటూబ్‌లో పరిశీలించి.. చివరకు ఈ వ్యక్తి చేసిన పని..
ABN , First Publish Date - 2022-12-16T20:08:33+05:30 IST
సొంత మనుషులు అనుకున్న వాళ్లే చివరకు శత్రువులవుతుంటారు. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రులవుతుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే..
సొంత మనుషులు అనుకున్న వాళ్లే చివరకు శత్రువులవుతుంటారు. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రులవుతుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో బంధువు కుటుంబ సభ్యులను సొంత మనుషులు అనుకున్నాడు. అయితే బంధువే చివరకు తన శత్రువుగా మారతాడని అతను ఊహించలేదు. దృశ్యం2 సినిమాను రెండు సార్లు చూసి, య్యూటూబ్‌లో వీడియోలు కూడా పరిశీలించి ఆ వ్యక్తి చివరకు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
చనిపోతే అయినా తల్లిదండ్రులు చూడటానికి వస్తారనుకున్నాడేమో.. హాస్టల్‌లో ఓ బీటెక్ కుర్రాడి దారుణమిదీ..!
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్‌పత్ జిల్లా పరిధి ముకంద్‌పూర్ గ్రామానికి చెందిన అంకిత్ ఖోఖర్ అనే వ్యక్తి.. లక్నోలో పీహెచ్‌డీ (Ph.D) పూర్తి చేశాడు. గడిచిన 25 ఏళ్లలో ఇతడి తల్లిదండ్రులతో సహా కుటుంబం మొత్తం వివిధ కారణాల వల్ల చనిపోయారు. కొన్ని నెలలుగా అంకిత్ ఖోఖర్.. ఘజియాబాద్‌కు చెందిన తన బంధువైన ఉమేష్ శర్మ ఇంట్లో ఉంటున్నాడు. అంకిత్‌కు ఎవరూ లేకపోవడంతో ఉమేష్ కుటుంబ సభ్యులను తన సొంత మనుషుల్లా చూసుకునేవాడు. ఇటీవల అంకిత్ జర్మనీకి వెళ్లి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (Post Doctoral Fellowship) చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన భూమి మొత్తాన్ని కోటి రూపాయలకు పైగా విక్రయించాడు. అయితే ఈ క్రమంలో అంకిత్ వద్ద ఉమేష్.. రూ.30లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం చేయడంతో పాటూ ఇటీవల కొత్త ఇల్లు కూడా కొన్నాడు. అంకిత్‌కు జర్మనీకి వెళ్లే ఉద్దేశం ఉండడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు. అయినా ఉమేష్ మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించేవాడు.
దీంతో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అంకిత్‌పై పగ పెంచుకున్న ఉమేష్.. అతన్ని చంపేస్తే ఆస్తి మొత్తం సొంతమవుతుందని కుట్రపన్నాడు. ఇందుకోసం అజయ్ దేవగన్ దృశ్యం-2 (Ajay Devgan Drishyam-2) సినిమాను రెండు సార్లు చూశాడు. మళ్లీ య్యూటూబ్‌లో పలు వీడియోలు (YouTube videos) చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. సోదరుడు ప్రవేశ్ శర్మ సాయంతో 2022 అక్టోబర్ 7న అంకిత్‌ను గొంతు నులిమి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పూడ్చి పెట్టేశారు. డిసెంబర్ 12వ తేదీన అంకిత్ కనబడలేందంటూ పోలీసుకు ఫిర్యాదు చేశారు. అయితే చివరకు పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అంకిత్ మృతదేహ భాగాల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.