Viral Video: ఆస్పత్రిలోకి అర్ధరాత్రి.. అదృశ్య వ్యక్తిని ఆహ్వానించిన సెక్యూరిటీ గార్డు.. దయ్యమే అంటూ పుకార్లు..
ABN , First Publish Date - 2022-11-23T18:15:12+05:30 IST
దయ్యాలు ఉన్నాయన్నది ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుత హైటెక్ యుగంలోనూ దయ్యాలకు సంబంధించిన అంశంపై ఆసక్తికర చర్చలు జరగడం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడూ అదిగో దయ్యం..
దయ్యాలు ఉన్నాయన్నది ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుత హైటెక్ యుగంలోనూ దయ్యాలకు సంబంధించిన అంశంపై ఆసక్తికర చర్చలు జరగడం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడూ అదిగో దయ్యం, ఇదిగో దయ్యం అంటూ పుకార్లు వస్తుండడంతో పాటూ అందుకు సబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అర్జెంటీనాలోని ఓ ఆస్పత్రిలో అర్ధరాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదృశ్య వ్యక్తిని సెక్యూరిటీ గార్డు లోపలికి అనుమతించడాన్ని చూసి.. అంతా షాక్ అవుతున్నారు. దీంతో అది నిజంగా దయ్యమే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
భార్యను ముళ్ల పొదల మధ్యలోకి తీసుకెళ్లిన భర్త.. కాసేటికి స్థానికులు వెళ్లి చూడగా..
అర్జెంటీనా (Argentina) ఫినోకియాటో శారిటోరియం బ్యూనస్ ఎయిర్స్‌లోని ఓ ఆస్పత్రిలో (Hospital) ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ ఈ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డు ఆస్పత్రి హాల్లో కూర్చుని రిజిస్టర్ చూసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ప్రధాన తలుపులు ఆటోమేటిక్‌గా తెరచుకుంటాయి. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డు పైకి లేచి, కాస్త ముందుకు వెళ్లి ఎవరినో లోపలికి అనుమతిస్తున్నట్లు ప్రవర్తిస్తాడు. తర్వాత రిజిస్టర్‌లో ఏదో రాసుకుని, ఆ అదృశ్య వ్యక్తిని లోపలికి వెళ్లమంటూ చేయి చూపిస్తాడు. అనంతరం తాను కూడా కాస్త ముందుకు వెళ్లి.. ఓ వీల్ చైర్‌ను చూపిస్తూ అందులో ఆ అదృశ్య వ్యక్తిని కూర్చోబెడుతున్నట్లు సైగ చేస్తాడు.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో! లోపలికి వచ్చింది నిజంగా దయ్యమే (devil).. అని కొందరు.. ఆ సెక్యూరిటీ గార్డు తలకు దెబ్బ తగిలి అలా ప్రవర్తిస్తున్నాడు అని మరికొందరు.. ఈ వీడియో చూస్తే నిజంగా భయమేస్తోంది.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఘటన జరిగిన ముందు రోజు ఆస్పత్రిలో ఓ రోగి చనిపోయాడని తెలిసింది. ఆ రోజు రాత్రి తలుపు చాలాసార్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుందని, సెక్యూరిటీ గార్డు ఎంట్రీ చేసినా.. రిజిస్టర్‌లో ఎవరి పేరూ నమోదు కాలేదని సిబ్బంది తెలిపారు. మొత్తానికి ఈ 38 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..