ఒకే కంపెనీలో ఉద్యోగం.. మూడేళ్లుగా ప్రేమ.. ఇటీవల యువకుడి పెళ్లి ఊరేగింపు జరుగుతుందనగా.. సడన్‌గా..

ABN , First Publish Date - 2022-12-09T17:54:56+05:30 IST

అతనో కంపెనీ సేల్స్ విభాగంలో ఉద్యోగి. విధుల్లో భాగంగా ఓ రోజు ఒక ఇంటికి వెళ్లగా బాలిక పరిచయమైంది. ఆమెకూ తన కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. ఇలా ఇద్దరి మధ్య..

ఒకే కంపెనీలో ఉద్యోగం.. మూడేళ్లుగా ప్రేమ.. ఇటీవల యువకుడి పెళ్లి ఊరేగింపు జరుగుతుందనగా.. సడన్‌గా..

అతనో కంపెనీ సేల్స్ విభాగంలో ఉద్యోగి. విధుల్లో భాగంగా ఓ రోజు ఒక ఇంటికి వెళ్లగా బాలిక పరిచయమైంది. ఆమెకూ తన కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. చివరకు ప్రేమగా మారింది. మూడేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇటీవల సదరు యువకుడి వివాహ ఊరేగింపునకు ఒక రోజు ముందు సడన్‌గా పోలీసులు ఎంటరయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

PhonePe, Google Pay ద్వారా పొరపాటున వేరేవాళ్లకు పంపిన డబ్బులు వెనక్కు తెప్పించాలంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) న్యూ ఆగ్రా పరిధి దయాల్‌బాగ్ సమీపంలోని కృష్ణబాగ్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి .. ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ విభాగంలో పని చేసేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం సేల్స్ నిమిత్తం ఆగ్రాలో ఉంటున్న ఓ బాలిక (girl) ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. తమ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె కూడా రాహుల్ కంపెనీలో చేరింది. రోజూ ఆఫీసుకు వచ్చిపోయే క్రమంలో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. కొన్నాళ్లకు ఇది ప్రేమగా (love) మారింది. రోజూ ఇద్దరూ బయటి ప్రాంతాలకు వెళ్లివస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఆమెను వివాహం (marriage) చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆమె కూడా అతన్ని ఎంతో నమ్మింది.

crime-2.jpg

55 ఏళ్ల ఉపాధ్యాయుడి బ్యాంక్ అకౌంట్లో రూ.21.53 లక్షలు మటాష్.. ఆయన చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో..

ఇలా ఆమెను నమ్మించి... పలుమార్లు అమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. ఇలా మూడేళ్లుగా ఆమెను మభ్యపెడుతూనే వచ్చాడు. అయితే ఇటీవల ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయినా అతను ఏదో ఒక సాకు చూపుతూ వాయిదా వేస్తూ ఉండేవాడు. వీరి ప్రేమ గురించి రెండు కుటుంబాల వారికీ తెలిసినా.. రాహుల్ మాత్రం ఆమెను పెళ్లి చేసుకునేందుకు మాత్రం అనాసక్తిగా ఉండేవాడు. ఇలావుండగా, రాహుల్ ఇటీవల ప్రియురాలికి తెలీకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మధురకు చెందిన యువతి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.

రైల్లో వెళ్తున్నాడో వ్యక్తి.. స్కూల్‌లో ఉండాల్సిన పక్కింటి పిల్లాడు బోగీలో ప్రత్యక్ష్యం.. ఆరా తీస్తే కంగారు పడుతూనే..

డిసెంబర్ 9న రాహుల్ వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం బుధవారం ప్రియురాలికి తెలిసింది. మోసపోయానని తెలుసుకున్న ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాహుల్ పెళ్లి ఊరేగింపునకు ఒక రోజు ముందు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి ఆగిపోవడంతో ఓ వైపు వధువు కుటుంబ సభ్యులు షాక్‌లో ఉండగా, మరోవైపు కొడుకు జైలకు వెళ్లడంతో.. అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కళాశాల వద్ద అదే పనిగా తిరుగుతున్న యువకులు.. అనుమానం వచ్చి బ్యాగుల్లో తనిఖీ చేయగా..

Updated Date - 2022-12-09T17:55:07+05:30 IST