దుకాణదారుడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన యువతి.. విషయం తెలుసుకుని బకెట్‌తో నీళ్లు చల్లడంతో..
ABN , First Publish Date - 2022-12-16T21:13:48+05:30 IST
బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా అన్ని వయసుల వారూ నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ప్రధానంగా శాడిస్టుల నుంచి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతుంటాయి. తమ దారికి తెచ్చుకునేందుకు..
బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా అన్ని వయసుల వారూ నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ప్రధానంగా శాడిస్టుల నుంచి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతుంటాయి. తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించడం, వినని వారి పట్ల వివిధ రూపాల్లో దాడులు చేస్తుంటారు. ఎన్ని శిక్షలు వేస్తున్నా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా బాలికకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ దుకాణదారుడి వద్దకు ఓ బాలిక పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు అతను బకెట్ నీళ్లు తీసుకుని చల్లకపోయి ఉంటే సమస్య పెద్దది అయ్యుండేది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఢిల్లీలోని (Delhi) ద్వారకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఓ రోజు ఓ యువతి (young woman) పరుగెత్తుకుంటూ దుకాణదారుడి (shopkeeper) వద్దకు వచ్చింది. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని, కంగారుగా కనిపించడంతో మొదట అతడికి అర్థం కాలేదు. కాసేపటికి ఆమె ముఖంపై ఎవరో యాసిడ్ చల్లినట్లు గుర్తించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే బకెట్‌తో నీళ్లు తీసుకుని ఆమె మొఖంపై చల్లాడు.
దీంతో యువతికి కొంచెం ఉపశమనం కలిగింది. తర్వాత ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతికి 8శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. సమయానికి దుకాణదారుడు సమయానికి స్పందించకుంటే బాలిక పరిస్థితి విషమంగా ఉండేది. ఇదిలావుండగా ఆమెపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ చల్లినట్లు (Acid attack) మాత్రం స్థానికులు తెలిపారు. అయితే వారు ఎవరు అన్న విషయం ఇంకా తెలియరాలేదు. యువతి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో ఏమీ చెప్పలేని పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.