ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో.. 10 నెలల పాటు పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN , First Publish Date - 2022-11-19T18:53:59+05:30 IST
వివిధ సమస్యల కారణంగా విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్ని తీవ్ర సంచలనం సృష్టిస్తుంటాయి. కొన్ని మిస్టరీగా మిగిలిపోతుండగా, మరికొన్ని కేసుల్లో చివరకు షాకింగ్ ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. మధ్యప్రదేశ్‌లో..
వివిధ సమస్యల కారణంగా విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్ని తీవ్ర సంచలనం సృష్టిస్తుంటాయి. కొన్ని మిస్టరీగా మిగిలిపోతుండగా, మరికొన్ని కేసుల్లో చివరకు షాకింగ్ ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు పది నెలలుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే చివరకు షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
Viral Video: స్నాక్స్ కోసం దుకాణానికి జింక.. ఆవేదనలో నెటిజన్లు..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఖాండ్వా పరిధి ఘస్పురాకు చెందిన షేక్ జునైద్ అనే వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో (Forest Department) ఉద్యోగం చేస్తుంటాడు. ఇతడి తంద్రి షేక్ ఫరీద్ పక్షవాతం కారణంగా ఉద్యోగ విరమణ చేయడంతో.. ఆ ఉద్యోగాన్ని కొడుక్కి ఇచ్చారు. ఇదిలావుండగా, గతంలో జునైద్ స్థలాలు అమ్మడం, కొనడం చేస్తుండేవాడు. అయితే కరోనా కారణంగా ఆ వ్యాపారం బాగా దెబ్బతింది. అయితే ఆ సమయంలో సుమారు150మంది నుంచి సుమారు రూ.5కోట్లు (crores rupees Debts) అప్పుగా తీసుకున్నాడు. అయితే తిరిగి వారికి చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం చేశాడు. అయితే తిరిగి చెల్లించే క్రమంలో నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలో అతడికి దుర్బుద్ధి పుట్టింది.
రోడ్డు పక్కన పడి ఉందో సూట్‌కేస్.. అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు మైండ్‌బ్లాక్.. అందులో..
డబ్బులు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. జవవరి 27న ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. ఇండోర్-ఇచ్చాపూర్ హైవేపై నర్మదా నది వద్ద కారు కాపాడు. తర్వాత తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘‘నేను బాకీ ఉన్న వారందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలనే ఉంది. సమయం ఇచ్చి ఉంటే ఇచ్చేవాడిని. కానీ అంతా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. ఇలా జరగాలని అల్లా రాసి పెట్టినట్లున్నారు. నా కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు వేరే మార్గం లేదు. పిల్లలను జాగ్రత్తగా చూసుకో’’.. అని చెప్పి నీటిలోకి దూకాడు.
Bachelors Village: ఆ ఊళ్లో మగాళ్లకు వింత సమస్య.. 40 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు అవకపోవడం వెనుక..!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అప్పటి నుంచి మృతదేహం కోసం గాలిస్తున్నా ఎక్కడా కనిపించలేదు. అయితే ఇటీవల స్థానికులు అనుమానం వచ్చిది. జునైద్ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడంతో పాటూ బంధువులతో పార్టీలు చేసుకోవడం చూసి ఏదో జరుగుతోందని సందేహం వచ్చింది. చివరకు విచారించగా.. ఇండోర్, రాయ్‌పూర్, ముంబై తదితర ప్రాంతాల్లో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులకు విషయం తెలియజేశారు. ప్రస్తుతం జునైద్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..