పెళ్లి విషయం మాట్లాడాలంటూ కొడుకు ప్రియురాలిని పిలిచిన తండ్రి.. నేనున్నా అని హామీ ఇచ్చి.. ఊహించని విధంగా..
ABN , First Publish Date - 2022-11-27T15:36:15+05:30 IST
పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో యువతి అతడికి దగ్గరైంది. ఈ క్రమంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డా.. కాబోయే భర్తే కదా అని ఎవరికీ చెప్పలేదు. అయితే..
పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో యువతి అతడికి దగ్గరైంది. ఈ క్రమంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డా.. కాబోయే భర్తే కదా అని ఎవరికీ చెప్పలేదు. అయితే చివరకు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో మాట మార్చాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడు తండ్రి వద్దకు వెళ్లింది. నేనున్నా.. అని హామీ ఇచ్చిన అతడను కూడా చివరకు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఇలాంటి వివాహం ఇప్పటిదాకా జరగలేదట.. అంతమంది పోలీసులు ఎందుకొచ్చారంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్‌లోని నిషాత్‌పురా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman).. కాస్మొటిక్ షాప్‌లో పని చేస్తోంది. అక్కడే పని చేసే ఓ యువకుడు (young man) ఇటీవల యువతికి పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి కొన్నాళ్లకు ప్రేమకు (love) దారితీసింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో యువతి అతన్ని నమ్మింది. తర్వాత ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లే క్రమంలో పలుమార్లు అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. కాబోయే భర్తే కావడంతో ఆమె కూడా వీరి ప్రేమ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేసేవాడు.
వైద్య విద్యకు మధ్యలోనే పులుస్టాప్.. UPSC ఫలితాల్లో నాలుగో ర్యాంక్.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదీ..!
ఈ క్రమంలో ఓ రోజు గట్టిగా నిలదీయడంతో.. పెళ్లి చేసుకునేదే లేదని తెగేసి చెప్పాడు. దీంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదే విషయాన్ని ప్రియుడి తండ్రికి చెప్పింది. ‘‘మా కొడుకుతో నేను మాట్లాడి ఒప్పిస్తా’’.. అని యువతికి అతను హామీ ఇచ్చాడు. ఓ రోజు పర్సనల్‌గా మాట్లాడాలంటూ యువతికి ఫోన్ చేసి పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెపై అతడు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా మాయమాటలు చెప్పి పలుమార్లు శారీరకంగా వేధించాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి ప్రియుడు, అతడి తండ్రి కోసం గాలిస్తున్నారు.
ఏం ఐడియా గురూ.. ఈ వ్యక్తి కారునే దుకాణంగా మార్చడం వెనుక కథేంటో తెలిస్తే..!