రాత్రిపూట వీధుల్లో ఒంటరిగా ఓ బాలిక.. ఆమె కథంతా విని కన్నీటిపర్యంతమైన పోలీసులు.. కాసేపటికే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-11-03T18:29:05+05:30 IST

ఆ బాలికది మధ్య తరగతి కుటుంబం (Middle class family). కూలీనాలీ చేసుకునే ఆమె తల్లిదండ్రులు కరోనా కారణంగా చనిపోయారు. దీంతో బాలిక (girl) అనాథగా మరిపోయింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు.. తల్లి స్నేహితురాలు చేరదీసింది. అయితే అక్కడ కూడా ఆమె ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలీని పరిస్థితిలో..

రాత్రిపూట వీధుల్లో ఒంటరిగా ఓ బాలిక.. ఆమె కథంతా విని కన్నీటిపర్యంతమైన పోలీసులు.. కాసేపటికే షాకింగ్ ట్విస్ట్..!

ఆ బాలికది మధ్య తరగతి కుటుంబం (Middle class family). కూలీనాలీ చేసుకునే ఆమె తల్లిదండ్రులు కరోనా కారణంగా చనిపోయారు. దీంతో బాలిక (girl) అనాథగా మరిపోయింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు.. తల్లి స్నేహితురాలు చేరదీసింది. అయితే అక్కడ కూడా ఆమె ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో తెలీని పరిస్థితిలో, రాత్రి వేళ రోడ్లపై తిరుగుతూ ఉంది. ఈమె కథ విని చివరకు పోలీసులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే చివరకు షాకింగ్ ట్విస్ట్ తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

Viral Video: స్కూటీ ముందు వైపు నుంచి శబ్ధాలు.. ఏంటా అని తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భేతుల్ వీధుల్లో మంగళవారం రాత్రి ఓ 14 ఏళ్ల బాలిక ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. గమనించిన కొందరు సామాజిక కార్యకర్తలు.. ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. పోలీసులు ఆమెను విచారించగా.. తన సమస్యను తెలియజేసింది. ‘‘మా తల్లిదండ్రులు కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) సమయంలో చనిపోయారు. అప్పటి నుంచి నేను అనాథను అయ్యాను. ఏ దిక్కూ లేని సమయంలో మా అమ్మమ్మ.. నన్ను పోషించలేక, మా అమ్మ స్నేహితురాలి ఇంటికి పంపించింది. అక్కడ కొన్నాళ్లు ఉన్నా.. వాళ్లకు కూడా నన్ను పోషించడం కష్టమైంది. దీంతో ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో అక్కడి నుంచీ వచ్చేశాను. చివరకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక.. రోడ్లపై తిరుగుతున్నా’’.. అని జరిగిన విషయం తెలియజేసింది.

కూలి పనులకు వెళ్లిన మహిళ.. ధాన్యం తూర్పారపడుతుండగా.. ఫ్యాన్ కారణంగా సడన్‌గా..

బాలిక కథ విన్న అక్కడున్న వారితో పాటూ పోలీసులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో కొద్ది సేపు అలాగే ఉండిపోయారు. చివరకు బాలికను ప్రభుత్వ సంరక్షణ శాలకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో వారికి ఓ అనుమానం వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో చనిపోయిన వారి లిస్టును పరిశీలించారు. అయితే బాలిక తల్లిదండ్రుల పేర్లు అందులో లేకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. దీంతో బాలిక చెబుతున్నది నిజమా, కాదా అనే సందిగ్ధంలో ఉన్నారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్‌కి బాలిక సోదరితో పాటూ ఆమె తండ్రి కూడా వచ్చాడు.

నిర్మానుష్య ప్రదేశంలో.. కూతురు కేకలు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన తల్లి.. అక్కడి దృశ్యం చూసి..

తమ కూతురు సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, స్టేషన్‌లో ఉందనే సమాచారం అందడంతో ఇక్కడికి వచ్చామని తెలిపారు. చివరకు బాలిక సోదరి అసలు విషయం చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. సోమవారం బాలిక టీవీలో ఓ సినిమా (TV movie) చూసింది. అందులో ఉన్నట్లుగానే ఓ కథను అల్లి, ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలిసింది. బాలిక తండ్రి వ్యవసాయ కూలీ కాగా, ఆమెకు ఓ సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. ఇంతకీ బాలిక ఇలా ఎందుకు చేసిందో అర్థం కాలేదంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు అసలు విషయం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరగా బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి, తండ్రితో పాటూ పంపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

21 రోజుల క్రితం పుట్టిన పాపకు విపరీతంగా ఉబ్బిన పొట్ట.. స్కానింగ్ రిపోర్ట్‌‌ను చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..!

Updated Date - 2022-11-03T18:29:09+05:30 IST