గట్టిగా అరవద్దంటూ విద్యార్థినికి రూ.10లు ఇచ్చిన టీచర్.. బాలిక ఇంటికి వెళ్లిన రెండు రోజుల తర్వాత..
ABN , First Publish Date - 2022-10-30T16:47:11+05:30 IST
విద్యార్థులు తప్పు చేస్తే మందలించాల్సిన టీచర్లు.. అందుకు విరుద్ధంగా వారే తప్పులు చేస్తూ.. అందరితో ఛీకొట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల.. మిగతా టీచర్లకు చెడ్డపేరు వస్తోంది. ఈ తరహా ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. టీచర్ చేసిన పనికి.. ఓ విద్యార్థిని గట్టిగా అరిచింది. దీంతో..
విద్యార్థులు తప్పు చేస్తే మందలించాల్సిన టీచర్లు.. అందుకు విరుద్ధంగా వారే తప్పులు చేస్తూ.. అందరితో ఛీకొట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల.. మిగతా టీచర్లకు చెడ్డపేరు వస్తోంది. ఈ తరహా ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. టీచర్ చేసిన పనికి.. ఓ విద్యార్థిని గట్టిగా అరిచింది. దీంతో ఎవరికీ చెప్పొందంటూ టీచర్ ఆమెకు రూ.10లు ఇచ్చాడు. కానీ రెండు రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Viral Video: వీడేంట్రా.. ఏకంగా సింహానికే పాలు పడుతున్నాడు.. చూస్తే ఖచ్చితంగా షాకవుతారు..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) డియోరియా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో (Primary school) అన్వర్ అలీ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల పాఠశాలలకు దీపావళి సెలవులు (Diwali holidays) ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 25న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మొదటి రోజు కావడంతో పది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక (girl) .. తరగతి గదులను ఊడుస్తోంది. ఒంటరిగా ఉన్న విద్యార్థిని వద్దకు వెళ్లిన అన్వర్... వెనుక నుంచి ఆమెను గట్టిగా పట్టుకుని అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు.
వద్దంటున్నా.. అనవసరంగా వారితో పెట్టుకున్నాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..
దీంతో బాలిక ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టింది. దీంతో భయపడ్డ టీచర్.. ఆమె నోరు మూసి, ఎవరికీ చెప్పొందంటూ రూ.10లు ఇవ్వడంతో పాటూ మిఠాయిలు కొనిపెట్టాడు. ఇక సమస్య ఉండదులే అని అనుకున్నాడు. అయితే 26, 27 తేదీల్లో పాఠశాలకు మళ్లీ సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో బాలిక ఇంటి వద్ద మూడీగా ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఎందుకు అలా ఉన్నావంటూ.. గట్టిగా ప్రశ్నించడంతో, పాఠశాలలో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. 28న పాఠశాల తెరవగానే బాలికతో పాటూ కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
స్నేహితుడి ప్రియురాలిపై మనుసులో మాటను బయటపెట్టాడు.. అలా మాట్లాడొద్దని అనడంతో..
ఈ విషయంపై టీచర్‌ని నిలదీయడంతో ముందు తప్పే చేయనట్లు బుకాయించాడు. గొడవ పెద్దది కావడంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు.. బీఎస్ఏ, బీఈవోలకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. సదరు టీచర్‌ని విచారించారు. చివరకు తప్పు చేసినట్లు తేలడంతో వెంటనే అతన్ని సస్పెండ్ చేశారు. ఇతను గతంలోనూ ఇలాంటి పనులు చేసి, క్షమాపణలు చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఈ టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో వారితో పాటూ పక్కింటి వ్యక్తికీ టీ ఇచ్చింది.. అమె చేసిన చిన్న పొరపాటుకు.