Viral Video: వధూవరుల మధ్య బిగ్ ఫైట్.. వద్దన్నా స్వీట్ తినిపించాడని చెంప పగలగొట్టి మరీ..!
ABN , First Publish Date - 2022-12-16T15:24:55+05:30 IST
ప్రస్తుతం జరిగే చాలా వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక అంశానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని అనుకోకుండగా జరుగుతుండగా, మరికొన్ని..
ప్రస్తుతం జరిగే చాలా వివాహ కార్యక్రమాల్లో ఏదో ఒక అంశానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని అనుకోకుండగా జరుగుతుండగా, మరికొన్ని వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తుంటారు. ఇందులో భాగంగానే వధూవరులు మండపంలోకి వినూత్నంగా ఎంటరవ్వడం, వేదికపై అందరి ముందు.. ఒకరినొకరు ఆటపట్టించుకోవడం తదితర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కావాలని చేశారో, లేక అనుకోకుండా జరిగిందో తెలీదు గానీ.. ప్రస్తుతం వధూవరులకు (bride and groom) సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వద్దన్నా స్వీట్ తినిపించాడని వరుడి చెంపను పగులగొట్టింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
ట్విట్టర్లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. వివాహ వేదికపై వధూవరులు ఆశీనులై ఉంటారు. పక్కన ఇరువైపు కుటుంబాల బంధువులు ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడే వచ్చింది అసలు సమస్య. వరుడు ఎంతో ముచ్చటగా స్వీట్ తీసుకుని వధువుకి తినిపిస్తాడు. అయితే వధవుకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా తినిపించడం సమస్యకు దారి తీసింది. అప్పటికే కోపంతోనే ఉన్న వధువు.. వరుడి చెంప చెల్లుమనిపిస్తుంది. ప్రేమతో తినిపిస్తే.. నన్నే కొడతావా.. అంటూ వధువును రెండు సార్లు కొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ (quarrel) ముదిరిపోతుంది. ఒకరినొకరు జుట్టు పట్టుకుని, అటూ ఇటూ తోసుకుంటూ దాడి చేసుకుంటారు. పక్కనున్న వారు ఎంత విడిపించాలని చూసినా వారు మాత్రం తగ్గకుండా కొట్టుకుంటూనే ఉంటారు. ఈ వీడియోపై చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రేపు వీరి సంసారం ఎలా ఉంటుందో అర్థమవుతోంది... అంటూ కొందరు, ఇదంతా కావాలనే చేశారు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.