మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్.. ఆరు నిముషాల్లో వారు చేసిన పని..

ABN , First Publish Date - 2022-11-20T16:09:03+05:30 IST

ఫిర్యాదులపై స్పందించడంలో కొందరు పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వీరి నిర్లక్ష్యానికి ఒక్కోసారి నిండు ప్రాణాలు బలవుతుంటాయి. అయితే మరికొందరు పోలీసులు మాత్రం.. విధి నిర్వహణలో..

మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్.. ఆరు నిముషాల్లో వారు చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

ఫిర్యాదులపై స్పందించడంలో కొందరు పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వీరి నిర్లక్ష్యానికి ఒక్కోసారి నిండు ప్రాణాలు బలవుతుంటాయి. అయితే మరికొందరు పోలీసులు మాత్రం.. విధి నిర్వహణలో ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటారు. బాధితులు తగిన న్యాయం చేసి.. అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పోలీసులు ఫోన్ వచ్చింది. దీంతో కేవలం ఆరు నిముషాల్లో అక్కడికి చేరుకుని ఆమె ప్రాణాలను కాపాడారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు.. ఊహించని విధంగా ఆమె చేసిన పనితో.. కాసేపటికి..

ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) చక్రతా పరిధి కల్సి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో గానీ.. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ (woman).. ఇటీవల ఓ రోజు ఆత్మహత్య (suicide attempt) చేసుకునేందుకు యత్నించింది. అంతా చూస్తుండగా ఇంట్లోకి వెళ్లిన ఆమె.. గది తలుపులు మూసేసింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కంగారుపడ్డారు. అంతా కలిసి తలుపు తీయని గట్టిగా అరిచారు. అయినా మహిళ మాత్రం స్పందించలేదు. ఎంత ప్రయత్నించినా ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో అంతా భయపడిపోయారు. చివరకు పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం అదించారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది.

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో.. 10 నెలల పాటు పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

సమాచారం అందుకున్న పోలీసులు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటిన బయలుదేరారు. కేవలం ఆరు నిముషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు పిలిచినా మహిళ స్పందించకపోవడంతో.. వెంటనే తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే సదరు మహిళ ఇంట్లో ఉరికి వేలాడుతోంది. లోపలికి వెళ్లిన పోలీసులు వెంటనే ఆమెను కిందకు దించారు. ప్రాణాలతో ఉండడంతో వేగంగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సమయానికి స్పందించి.. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..

Updated Date - 2022-11-20T16:17:42+05:30 IST