Viral Video: స్నాక్స్ కోసం దుకాణానికి జింక.. ఆవేదనలో నెటిజన్లు..
ABN , First Publish Date - 2022-11-19T17:10:49+05:30 IST
జింకకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అటవీ సమీప ప్రాంతంలో ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లిన జింక.. స్నాక్స్ కావాలి అన్నట్లుగా వేచి చూస్తూ ఉంటుంది. దీనిపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు..
అడవులు కొన్నిచోట్ల అభివృద్ధి పేరుతో తరిగిపోతుంటే.. మరికొన్ని చోట్ల యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో వణ్యప్రాణులకు ఆవాసం లేకుండా పోతోంది. దిక్కుతోచని స్థితిలో అప్పుడప్పుడూ పలు జంతువులు జనారణ్యంలోకి వస్తుండడం తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఆహారం, నీటి కోసం అటవీ సమీప ప్రాంతాల్లోకి (Forest area) వస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ జింకకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అటవీ సమీప ప్రాంతంలో ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లిన జింక.. స్నాక్స్ కావాలి అన్నట్లుగా వేచి చూస్తూ ఉంటుంది. దీనిపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: పారిపోతున్న పామును పిలిచిమరీ కెలికాడు.. చివరికి ఏమయ్యిందంటే..
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. కేరళ (Kerala) త్రిసూరు జిల్లా పులియిలప్పర అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న దుకాణం వద్దకు ఓ సంబార్ జింక (Sambar Deer) వస్తుంది. దుకాణం ఎదురుగా వెళ్లి.. స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినట్లుగా.. చాలా సేపు అక్కడే నిలబడుతుంది. అక్కడే ఉన్న ఓ వృద్ధుడు చేతిలో వడ పట్టుకుని సంబార్ జింకను ఇటురా.. అని పిలుస్తాడు. అతడి సైగలను గమనించిన జింక.. మెల్లగా అక్కడికి వెళ్లి వడను తింటుంది.
Viral Video: సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలతో జాలీ రైడ్.. చిన్నారుల బ్యాలెన్స్ చూస్తే..
తర్వాత అక్కడే ఉన్న వ్యక్తులు జింకతో ఫొటోలు దిగుతారు. ఓ వ్యక్తి జింకకు టీ తాపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ జింక మాత్రం.. నాకు టీ అలవాటు లేదు.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. తర్వాత ఎవరైనా ఆహారం పెడతారేమో అని చాలా సేపు అక్కడే ఉండిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ సంబార్ జింకకు వడ అంటే ఇష్టమేమో.. అంటూ కొందరు, మనుషులు చేసిన తప్పులకు వణ్యప్రాణులు బలవుతున్నాయి.. అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..