Viral Video: ఏనుగుపై సవారీ చేస్తుండగా షాకింగ్ ఘటన.. వరి పొలంలో సడన్‌గా ప్రత్యక్షమైన పులి.. చివరకు..
ABN , First Publish Date - 2022-12-29T19:47:27+05:30 IST
పులి దాడి చేసే సమయంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. వేటను టార్టెట్ చేసే సమయంలో దాని తెలివి చూస్తే వామ్మో! అని అనిపిస్తుంటుంది. పులులు, సింహాల దాడులకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..
పులి దాడి చేసే సమయంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. వేటను టార్టెట్ చేసే సమయంలో దాని తెలివి చూస్తే వామ్మో! అని అనిపిస్తుంటుంది. పులులు, సింహాల దాడులకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పులి దాడికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏనుగుపై (elephant) సవారీ చేస్తున్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరి పొలంలో వెళ్తుండగా మాటు వేసి ఉన్న పులి.. ఒక్కసారిగా అతడిపై దాడికి దిగింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..
ట్విట్టర్‌లో ఓ వీడియో తెగ వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ వ్యక్తి ఏనుగుపై సవారీ చేస్తుంటాడు. వరి పొల్లాల్లో సంచరిస్తుండగా షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంటుంది. అప్పటికే వరి పొలంలో మాటు వేసి ఉన్న పులి.. ఏనుగుపై ఉన్న వ్యక్తిని టార్టెట్ చేస్తుంది. సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బయటికి వచ్చి.. వేగంగా ఏనుగు పైకి (Tiger attack) దూకుతుంది. ఏకంగా ఏనుగుపై కూర్చున్న వ్యక్తి పైకి దూకాలని చూస్తుంది. అయితే వెంటనే అప్రమత్తమైన అతడు.. కర్రతో పులి తలపై కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చాలా రోజుల కిందట జరిగిన ఘటనే అయినా.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.