Viral Video: పారిపోతున్న పామును పిలిచిమరీ కెలికాడు.. చివరికి ఏమయ్యిందంటే..

ABN , First Publish Date - 2022-11-18T19:22:40+05:30 IST

కొందరు కావాలనే సాటి వారి సహనాన్ని పరీక్షిస్తుంటారు. అవతలి వారు సౌమ్యులైతే ఎలాగోలా భరిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం చివరకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ క్రమంలో..

Viral Video: పారిపోతున్న పామును పిలిచిమరీ కెలికాడు.. చివరికి ఏమయ్యిందంటే..

కొందరు కావాలనే సాటి వారి సహనాన్ని పరీక్షిస్తుంటారు. అవతలి వారు సౌమ్యులైతే ఎలాగోలా భరిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం చివరకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బంది పెట్టిన వ్యక్తి చిన్నా, పెద్దా అని కూడా చూడకుండా తిరగబడుతుంటారు. ఇది మనుషుల విషయంలోనే కాదు జంతువులు తదితరాల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ప్రస్తుతం ఓ పాముకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పారిపోతున్న పామును ఓ వ్యక్తి పిలిచిమరీ కెలుకుతాడు. దీంతో తిక్కరేగిన పాము చివరకు ఏం చేసిందంటే..

snake22.jpg

Viral Video: అమ్మబాబోయ్.. వీళ్లకెంత ధైర్యం.. మేకను మింగేందుకు సిద్ధమైన కొండ చిలువను ఏం చేశారంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram viral videos) ఓ వీడియో వైరల్ అవుతోంది. సరీసృపాల నిపుణుడు.. నీటిలో సంచరించే నల్లటి పాము (Water snakes) సహనాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతాడు. పాము పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో ఒక్కసారిగా అతడి వేలుపై కాటు వేస్తుంది. అయినా అతను వెనక్కు తగ్గకుండా మళ్లీ పామును పట్టుకుంటాడు. అప్పటికే చిర్రెత్తిపోయి ఉన్న పాము.. మళ్లీ కాటు వేస్తుంది. ఇలా రెండు, మూడు సార్లు అతడిపై కాట్లు వేస్తుంది. తర్వాత చుట్ట చుట్టుకుని పడుకుని పాము పక్కన చేయి పెట్టి.. తనకు పడ్డ కాట్లను చూపిస్తాడు. ఈ పాము కాటు ప్రమాదకరం కాకపోయినా.. కొన్నిసార్లు రక్తస్రావం, వాపు, కణజాల నష్టం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలతో జాలీ రైడ్.. చిన్నారుల బ్యాలెన్స్ చూస్తే..

Updated Date - 2022-11-18T19:22:45+05:30 IST