బాలికకు ఆన్లైన్లో పరిచయమైన యువకుడు.. కొన్నాళ్లకు ఆమె తండ్రికి ఫోన్ చేసి.. కూతురిని పంపమని అడగడంతో..
ABN , First Publish Date - 2022-12-22T18:51:12+05:30 IST
స్మార్ట్‌ఫోన్ సాయంతో రూపాయి పెట్టుబడి లేకుండా, ఎలాంటి అక్రమాలు చేయకుండా.. లక్షలు సంపాదించే వాళ్లు ఉన్నారు. అలాగే అదే స్మార్ట్‌ఫోన్‌ని దుర్వినియోగం చేసుకుని చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకునే వాళ్లు కూడా..
స్మార్ట్‌ఫోన్ సాయంతో రూపాయి పెట్టుబడి లేకుండా, ఎలాంటి అక్రమాలు చేయకుండా.. లక్షలు సంపాదించే వాళ్లు ఉన్నారు. అలాగే అదే స్మార్ట్‌ఫోన్‌ని దుర్వినియోగం చేసుకుని చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకునే వాళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఆన్‌లైన్ చదువుల కోసం తండ్రి కొనిచ్చిన మొబైల్‌ను బాలిక దుర్వినియోగం చేసింది. గేమ్‌లు ఆడే క్రమంలో అపరిచిత వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కొన్నాళ్లకు బాలిక తండ్రికి ఫోన్ చేసిన సదరు యువకుడు.. కూతురిని తన వద్దకు పంపాలని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ జనక్‌గంజ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 16ఏళ్ల పదో తరగతి బాలికకు.. కరోనా లాక్‌డౌన్ (Corona lockdown) సమయంలో తన తండ్రి స్మార్ట్ ఫోన్ (Smart phone) కొనిచ్చాడు. ఆన్‌లైన్ చదువుల కోసం కొనిచ్చిన మొబైల్‌ను.. బాలిక దుర్వినియోగం చేసింది. చదువు పూర్తవగానే ఫోన్‍లో వివిధ రకాల గేమ్‌లు ఆడుతూ ఉండేది. ఈ క్రమంలో ఫ్రీఫైర్ గేమ్ (Free fire game) ఆడుతూ ఉండగా.. ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. రోజూ గేమ్‌లు ఆడే క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నాళ్లకు బాలికకు సంబంధించిన.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook and Instagram) ఐడీతో పాటూ మొబైల్‌ను కూడా హ్యాక్ చేశాడు.
Viral Video: శీతాకాలంలో ఇలాంటి స్నానం ఎప్పుడైనా చేశారా.. లేదంటే ఈ వీడియో చూడండి..
తర్వాత ఆమె పర్సనల్ ఫొటోలు, వీడియోలను (Personal photos and videos) సేకరించాడు. కొన్నింటిని అసభ్యకరంగా మార్చి.. కొన్నాళ్ల తర్వాత బాలికకు పంపించాడు. దీంతో బాలిక షాక్ అయ్యి.. విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది. జూలై నుంచి యువకుడు బాలిక తండ్రిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. ‘‘నీ కూతురిని నా వద్దకు పంపు.. లేదంటే మీ కూతురు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తా’’.. అని బెదిరించేవాడు. అయినా బాలిక తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో ఇటీవల అతను.. బాలిక ఫొటోలు, వీడియోలను వైరల్ చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.