బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు.. కొన్నాళ్లకు అతిథి గృహంలో ప్రత్యక్షం.. ఓ రోజు రాత్రి బాలిక ఫొటోను చేతిలో పట్టుకుని..
ABN , First Publish Date - 2022-12-27T20:38:29+05:30 IST
కొందరు చేసిన తప్పులను సరిదిద్దుకోలేక.. చివరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొన్నిసార్లు చివరకు హత్యలు, ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ..
కొందరు చేసిన తప్పులను సరిదిద్దుకోలేక.. చివరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొన్నిసార్లు చివరకు హత్యలు, ఆత్మహత్యలకూ పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు. కొన్నాళ్లకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఇటీవల అతిథి గృహంలో ఉన్న యువకుడు.. ఓ రోజు రాత్రి బాలిక ఫొటోను చేత్తో పట్టుకుని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బదౌన్ పరిధి బరేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అలీమ్ (25) అనే యువకుడు.. ఇటీవల ఇక్కడి ప్రాంతానికి చెందిన హిందూ బాలికను.. అలీమ్ కిడ్నాప్ (Kidnapping) చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసుకున్ పోలీసులు.. కొన్నాళ్లకు ఆమెను ఢిల్లీలో అదుపులోకి తీసుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి అలీమ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు చాలా రోజులుగా గాలిస్తున్నారు.
Viral Video: తాళం తీసి ఉన్నా సరే.. ఈ ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎవరూ చేయరేమో..!
ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను విచారించారు. దీంతో అంతా అలీమ్‌ను దూరం పెట్టారు. ఈ కారణంగా అలీమ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అలీమ్.. ఠాణా సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఓ అతిథి గృహంలో ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి అలీమ్.. తన గదిలో ఒక చేత్తో బాలిక ఫొటోను పట్టుకుని, మరో చేత్తో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Whatsapp Alert: డిసెంబర్ 31 తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు..!