Dhaka Test: మెహిదీ హసన్ దెబ్బకు భారత్ విలవిల.. 100 పరుగులా? 6 వికెట్లా?

ABN , First Publish Date - 2022-12-24T16:35:25+05:30 IST

బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు(Team India) తడబడుతోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో

Dhaka Test: మెహిదీ హసన్ దెబ్బకు భారత్ విలవిల.. 100 పరుగులా? 6 వికెట్లా?
Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు(Team India) తడబడుతోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీహసన్ (Mehidy Hasan Miraz) దెబ్బకు విలవిల్లాడుతోంది. ఓపెనర్లు శుభమన్ గిల్ (7), కేఎల్ రాహుల్ (2), చతేశ్వర్ పుజారా (6) దారుణంగా నిరాశ పరిచారు. విరాట్ కోహ్లీ 22 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి మెహిదీ హసన్ బౌలింగులో మోమినుల్‌కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు అవసరం కాగా, బంగ్లాదేశ్ విజయానికి ఆరు వికెట్లు చాలు. ప్రస్తుతం అక్షర్ పటేల్ (26), జయదేవ్ ఉనద్కత్ (3) క్రీజులో ఉన్నారు. భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు మెహిదీ హసన్‌కే దక్కడం గమనార్హం.

అంతకుముందు ఆతిథ్య బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో లిటన్ దాస్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఓపెనర్ జకీర్ మసన్ అర్ధ సెంచరీ (51) పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (Axar Patel) మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2022-12-24T16:35:28+05:30 IST