పేదోళ్ల ఆత్మబలిదానం.. పెద్దోళ్లకు రాజ్యాధికారం

ABN , First Publish Date - 2022-12-03T01:33:02+05:30 IST

పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పెద్దోడు రాజ్యమేలుతున్నాడని కరీంనగర్‌ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్‌ అన్నారు.

పేదోళ్ల ఆత్మబలిదానం.. పెద్దోళ్లకు రాజ్యాధికారం
నర్సాపూర్‌(జి)లో ప్రసంగిస్తున్న బండి సంజయ్‌, వేదికపై ఎంపీ సోయం

నర్సాపూర్‌(జి), డిసెంబరు 2 : పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పెద్దోడు రాజ్యమేలుతున్నాడని కరీంనగర్‌ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా శుక్రవారం కుంటాల మండలం అంబకంటి నుంచి ప్రారంభమైన ప్రాదయాత్ర భామ్ని, నందన్‌ మీదు గా నర్సాపూర్‌ చేరుకుంది. నర్సాపూర్‌లో బండిసంజయ్‌ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్‌ ఆయన కుటుంబ ఏం త్యాగం చేశారని ఆయన ప్ర శ్నించారు. శ్రీకాంతాచారి లాంటి ఎందరో మంది విద్యార్థులకు ఆత్మబలిదానాలతో తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోలీసులు కిష్టయ్య, సుమన్‌ లాంటి వారు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డల పోరాట పటిమతో ఆనాడు బీజేపీ పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక బిల్లుకు మద్దతు పలకడంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో బిచ్చగానిగా ఉన్న కేసీఆర్‌ ఇప్పుడు లక్షల కోట్లకు ఎదిగాడని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడితే బతుకు బాగుపడతాయని ఆశించిన తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఆయన కుటుం బ సభ్యులు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నారన్నారు. మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ వైఖరి వల్ల 27 మంది ఆర్టీసీ కార్మికులు, 37 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కేసీఆర్‌ ప్రవర్తించిన తీరు పట్ల మూర్ఖుడు, బట్టేబాజ్‌ అంటూ తీవ్రపదజాలంతో మండిపడ్డారు. ఆ నాడు పార్లమెంట్‌లో సుష్మస్వరాజ్‌ మద్దతుతో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి అస లైన ద్రోహి కేసీఆరేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన కేసీఆర్‌కు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు. కేసీఆర్‌ అసలైన సమాఖ్య వాది అని ఇప్పుడు ఉద్యమకారు లంతా బీజేపీతోనే ఉన్నారు. సినిమాలో వేణుమాధవ్‌లా సెలైన్‌ పెట్టుకొని మందు తాగుతూ కేసీఆర్‌ ఖమ్మంలో దొంగదీక్ష చేశారని ఆరోపించారు. దళితబంధుపై ప్రశ్నించిన ఆడబిడ్డలపై కేసులు పెట్టిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ముఖ్యమంత్రి సహామంత్రులకు, టీఆర్‌ఎస్‌ నాయకులకు కండకావరం వచ్చిం దన్నారు. ప్రశ్నించిన ఆడబిడ్డలపై అక్రమకేసులు బనాయించారని వారిని బీజేపీ ప్రభుత్వం వచ్చాక వదిలే ప్రసక్తే లేదన్నారు.

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహా టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులపై ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తానని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో కాసీం చంద్రశేఖర్‌ రజ్వీ పాలనకు ఇక చరమ గీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాబో యేది ఇక రామరాజ్యమే అన్న బండిసంజయ్‌ రాబోయే రోజుల్లో గొల్లకొండ కోటపై కాషాయజెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ చిన్నగుడిసెను చూసి అక్కడికి వెళ్లిన బండిసంజయ్‌ ఆ గుడిసెలో నివసిస్తున్న గుమ్ముల చిన్నపోసాని అనే వితంతువును పలకరించి ఆమె కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న పోసాని కుమారుడుతో మాట్లాడిన సంజయ్‌ ఆ పిల్లోడికి సైకిల్‌ కొనిస్తానని ఉత్తేజపరిచారు. పోసాని లాంటి నిరుపేద ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీకు ఇల్లు ఇప్పించే ప్రయత్నిం చేస్తారని పోసానికి బండిసంజయ్‌ హామీ ఇచ్చారు. ఇలా హుషారుగా పలకరింపులు, భరోసాలతో బండిసంజయ్‌ పాద యాత్ర కొన సాగింది. ఈ యాత్రలో బీజేపీ నాయకులు, ఎంపీ సోయం బాపు రావు తో పాటు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ రమాదేవి, కృష్ణా గోదావరి జలాల కన్వనర్‌ రావుల రాంనాథ్‌, బీజేపీ సీనియర్‌ నాయకలు డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డి, నిర్మల్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి, ప్రముఖ న్యాయవాది వినాయక్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్‌, మెడిసెమ్మె రాజు, రామారావు పటేల్‌, మోహన్‌రావు పటేల్‌, బోస్లే బాజీరావు, భోజారెడ్డి, కొరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T16:30:18+05:30 IST