CV Anand: 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుంది
ABN , First Publish Date - 2022-12-21T14:25:55+05:30 IST
2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్: 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand)తెలిపారు. బుధవారం 2022లో క్రైమ్ రేట్పై సీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ... ఈ ఏడాది మొత్తం 22,060 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కొవిడ్ కారణంగా జనాలు కూడా ఎక్కువగా బయటికి రాలేదన్నారు. సైబర్ క్రైమ్కు సంబంధించిన నేరాలు పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయని... అలాగే ఈ ఏడాది భారీగా ఆర్థిక నేరాలు.. 949 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఈ ఏడాది భారీగా ఛీటింగ్ నేరాలు.. 4,297 కేసులు నమోదు అయ్యాయని సీవీ ఆనంద్ వెల్లడించారు.