Laxman: ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీపై నిందలు

ABN , First Publish Date - 2022-10-29T15:15:57+05:30 IST

నేత కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు.

Laxman: ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీపై నిందలు

హైదరాబాద్: నేత కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Gogvernment) మరోసారి మోసం చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Laxman) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ (BJP)పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల అభిప్రాయం మేరకే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేతలపై ప్రేమ ఉంటే.‌. రాష్ట్ర ప్రభుత్వమే 5 శాతం పన్నును భరించాలన్నారు. 40 లక్షల టర్నోవర్ ఉన్న సంస్థలకు మాత్రమే 5 శాతం పన్ను అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతోనే చేనేతపై 5శాతం పన్ను విధిస్తున్నట్లు చెప్పారు. చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేసీఆర్ (KCR) సర్కార్ మోసం చేస్తోందన్నారు. చేనేతలను వంచన చేస్తోన్న కేసీఆర్ ప్రభుత్వాని (KCR Government)కి చేనేతలు తగిన బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ (BJP MP) పిలుపునిచ్చారు.

Updated Date - 2022-10-29T15:15:59+05:30 IST