Rajagopal Reddy : సిద్ధార్థ ఇన్‌ఫ్రాతో నాకు సంబంధం లేదు

ABN , First Publish Date - 2022-12-01T01:34:12+05:30 IST

సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్‌ అండ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో తనకెలాంటి సంబంధం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్‌ జిల్లా నేరడిగొండ/

Rajagopal Reddy : సిద్ధార్థ ఇన్‌ఫ్రాతో నాకు సంబంధం లేదు
BJP leader Rajagopal Reddy

రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం

బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్‌ అండ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో తనకెలాంటి సంబంధం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్‌ జిల్లా నేరడిగొండ/సారంగపూర్‌ మండలాల పరిధిలో 1200 మెగావాట్లతో సదరు కంపెనీ పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ కేంద్రం నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి అంతరాష్ట్ర అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ-రివర్‌ వ్యాలీ అండ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్సు) నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో విద్యుత్‌ రంగానికి సంబంధించిన ఏ కాంట్రాక్టులు తాము చేపట్టడం లేదని, రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యాయని రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. గతంలో సుశీ ఇన్‌ఫ్రాకు సంబంధించి కూడా తనపై ఆరోపణలు చేశారని, వాటిలో వాస్తవాల్లేవని గుర్తు చేశారు. సుశీ ఇన్‌ఫ్రాతో కూడా కొంతకాలం నుంచి తనకు సంబంధాలు లేవని, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రత్యర్థి పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ కంపెనీకి గతంలో వచ్చిన కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా, నిబంధనలకు లోబడే వచ్చాయని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేసిన, చేస్తున్న నేతలను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎలాంటి కాంట్రాక్టు పనులు చేయడం లేదని తేల్చిచెప్పారు.

Updated Date - 2022-12-01T01:34:21+05:30 IST