Mahender Reddy: తెలంగాణ డీజీపీగా మహేందర్రెడ్డి పదవీ విరమణ
ABN , First Publish Date - 2022-12-31T10:07:14+05:30 IST
తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉత్సవ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy) పదవీ విరమణ ఉత్సవ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వీఐపీలు పాల్గన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్.. తెలంగాణలో దూరదృష్టి గల నాయకత్వం అందిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లు డీజీపీగా అవకాశం ఇచ్చి.. మోడ్రన్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు సహకరించినందుకు మహేందర్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
36 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ సేవలు...
మహేందర్రెడ్డి 36 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ సేవలు అందించారు. తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ, హైదరాబాద్ సీపీ సహా పలు కీలక పదవులు చేపట్టారు. మావోయిజం నియంత్రణలో విశేష కృషి చేశారు. సాంకేతికంగా పోలీస్శాఖలో మహేందర్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
మరోవైపు తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే నేరేడ్మెట్ ఆఫీస్లో రాచకొండ సీపీగా డీ.ఎస్.చౌహాన్ బాధ్యతలు చేపట్టనున్నారు.