TRS Tweet: మోదీ తెలంగాణ టూర్‌పై టీఆర్‌ఎస్ సెటైర్
ABN , First Publish Date - 2022-11-08T11:44:17+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ టూర్‌పై అధికార టీఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరింది.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) తెలంగాణ టూర్ (Telangana tour)పై అధికార టీఆర్‌ఎస్ పార్టీ (TRS party) ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరింది. ‘‘మోదీ వస్తున్నడు. మొన్న సర్కారును కూల్చే కుట్ర బయట పడి.. నిన్న మునుగోడులో ఓడి.. అయిపోయిన పెండ్లికి బాజాలు కొట్టినట్టు.. రెండేండ్ల క్రితమే పునఃప్రారంభమై, ఉత్పత్తులను దేశమంతటా పంపుతున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే పేర మాయ చేయడానికి కాకపోతే.. ఎందుకు వస్తున్నాడు?’’ అంటూ టీఆర్‌ఎస్ (TRS) ట్వీట్ చేసింది.
కాగా.. ఈనెల 12న ప్రధాని మోదీ (Prime minister) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.