Prahlad Joshi: కేసీఆర్.. అండర్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్
ABN , First Publish Date - 2022-11-18T15:19:32+05:30 IST
సీఎం కేసీఆర్.. అండర్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్‌గా పని చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Union Minister Prahlad Joshi) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ అరవింద్(MP Arvind) ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
హైదరాబాద్: సీఎం కేసీఆర్.. అండర్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్‌గా పని చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Union Minister Prahlad Joshi) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ అరవింద్(MP Arvind) ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ అభద్రతా భావానికి ఈ దాడి నిదర్శనం. టీఆర్ఎస్ నేతలు గుండాలా ప్రవర్తిస్తున్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎం(Cm kcr)ను చూడలేదు. అవినీతి, కుటుంబ పాలన వల్ల మిగులు నిధులు పోయి అప్పులు పెరిగాయి. కొందరు టీఆర్ఎస్ మంత్రులు, కేసీఆర్ కుటుంబం మాత్రం ధనికులు అయ్యారు. ప్రజలు మాత్రం పేదలుగా మిగిలారు. సింగరేణి సంస్థలో 51 శాతం వాటా రాష్ట్రానికి ఉంది. కేంద్రం ఎలా ప్రైవేటు పరం చేయగలదు. అంతా తప్పుడు ప్రచారం. ఒడిశా వేలంలో కోల్ బిగ్ దక్కించుకున్నారు. ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ది ద్వంద వైఖరి. కొన్ని నెలలుగా తెలంగాణలో పర్యటిస్తూ అనేక మందిని కలుస్తుంటే ప్రజలు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.’’ అని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.