Ts Investments : పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం
ABN , First Publish Date - 2022-11-08T05:56:33+05:30 IST
ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో
యూకే పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సోమవారం తనని కలిసిన యూకే పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తోన్న పారిశ్రామిక అనుకూల విధానాలను వారికి వివరించారు. యూకేకు చెందిన అనేక పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని తెలియజేశారు. ఈ భేటీలో వెస్ట్ మిడిల్‌ల్యాండ్స్ మేయర్ ఆండీ స్ర్టీట్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మరో సమావేశంలో లాఖీడ్ మార్టిన్ సంస్థ ప్రతినిధులు కూడా మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న తమ ప్లాంట్‌ను విస్తరించే యోచనలో ఉన్నామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రోన్ మెక్లీన్ మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో ఐటి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.