YSRTP Chief: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన షర్మిల

ABN , First Publish Date - 2022-12-14T14:02:28+05:30 IST

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

YSRTP Chief: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన షర్మిల

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి హైకోర్టు (YSRTP chief YS Sharmila again petitioned the High Court)ను ఆశ్రయించారు. పాదయాత్రకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటునారంటూ షర్మిల హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిన్న పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంటి నుంచి పోలీసులు బయటికి రానివ్వటం లేదని పిటిషన్‌లో తెలిపారు. షర్మిల పిటిషన్‌పై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరుగనుంది.

Updated Date - 2022-12-14T16:20:32+05:30 IST