Sharmila: మేము బాధితులమైతే.. మా పైనే కేసులు పెడుతున్నారు

ABN , First Publish Date - 2022-12-10T12:09:53+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.

Sharmila: మేము బాధితులమైతే.. మా పైనే కేసులు పెడుతున్నారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YSRTP YS Sharmila Fire on CM KCR) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కారణం లేకుండానే తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్నారు. తనపై వ్యక్తిగత దూషణలు చేస్తోంది టీఆర్ఎస్ నేతలన్నారు. ‘‘మేము బాధితులమైతే.. మా పైనే కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా మాపై కర్ఫ్యూ ఎత్తివేసి పాదయాత్రకు అనుమతివ్వాలి’’ షర్మిల (YSRTP Chief Sharmila) డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-10T12:09:55+05:30 IST