Ponnam Prabhakar: పాదయాత్రను అడ్డుకోవడం కరెక్ట్ కాదు

ABN , First Publish Date - 2022-11-30T13:04:54+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రశ్నించేందుకు పాదయాత్ర చేసే హక్కు లేదా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Ponnam Prabhakar: పాదయాత్రను అడ్డుకోవడం కరెక్ట్ కాదు

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రశ్నించేందుకు పాదయాత్ర చేసే హక్కు లేదా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. బుధవారం హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ధరణి పోర్టల్ (Dharani Portal), రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి చిట్ట చివరి బడ్జెట్‌లో రైతులకు రుణమాఫీ అమలు చేయాలన్నారు. వచ్చే యాసంగిలోపు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రైతుల సమస్యలు పట్టించుకోకుండా పాదయాత్రలకే పరిమితమయ్యారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Updated Date - 2022-11-30T13:07:24+05:30 IST