TS News: కంకర క్రషర్ల లీజులపై ప్రజాభిప్రాయసేకరణ.. వ్యతిరేకించిన గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-11-18T12:13:40+05:30 IST

జిల్లాలోని జిన్నారం మండలం రాళ్లకత్వ, ఊట్ల గ్రామాలలో కంకర క్రషర్ల లీజులపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు.

TS News: కంకర క్రషర్ల లీజులపై ప్రజాభిప్రాయసేకరణ.. వ్యతిరేకించిన గ్రామస్తులు

సంగారెడ్డి: జిల్లాలోని జిన్నారం మండలం రాళ్లకత్వ, ఊట్ల గ్రామాలలో కంకర క్రషర్ల లీజులపై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. కాగా.. సమావేశాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. కేవలం ముగ్గురు గ్రామస్తులు మాత్రమే సభకు హజరవటంతో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి వెనుదిరిగారు. రాళ్లకత్వ, ఊట్ల గ్రామాలలో ఎట్టి పరిస్థితుల్లో కంకర క్రషర్లకు అనుమతులు మంజూరు చేయవద్దని గ్రామ ప్రజలు మూకుమ్మడిగా నినదించారు.

Updated Date - 2022-11-18T12:30:37+05:30 IST