అది పార్టీల మధ్య ఘర్షణే: వద్దిరాజు

ABN , First Publish Date - 2022-11-20T03:11:15+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్‌ల మధ్య జరుగుతున్నది కులాల ఘర్షణ

అది పార్టీల మధ్య ఘర్షణే: వద్దిరాజు

ఖమ్మం/బంజారాహిల్స్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్‌ల మధ్య జరుగుతున్నది కులాల ఘర్షణ కాదని, టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణ అని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దీనికీ మున్నూరుకాపు సంఘానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. శనివారం ఖమ్మంలో తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అర్వింద్‌ ఇంటిపై దాడి సంఘటనను మున్నూరుకాపు సంఘంపై జరిగిన దాడిగా కొందరు చిత్రీకరించడం తగదన్నారు. అర్వింద్‌ కాంగ్రె్‌సలో ఉన్నప్పుడు బీసీలకు కోసం కేటాయించిన టికెట్లను అమ్ముకున్నారని, అలాంటి చరిత్ర ఉన్న ఆయన.. ఎంపీగా గెలిచి దేశానికి నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చిన దానం నాగేందర్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ రవీందర్‌ తదితరులు ఆమెకు సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం పోలీసుల అదుపులో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, రాజారాంయాదవ్‌ తదితరులను పరామర్శించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సాధరమే కాని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దన్నారు.

Updated Date - 2022-11-20T03:11:16+05:30 IST