Telangana High Court: ఫామ్‌హౌస్ కేసు విచారణ రేపటికి వాయిదా
ABN , First Publish Date - 2022-11-14T18:27:39+05:30 IST
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs poaching case) వ్యవహారంపై ఫామ్‌హౌస్ కేసు (Farmhouse case) లో విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs poaching case) వ్యవహారంపై ఫామ్‌హౌస్ కేసు (Farmhouse case) లో విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. కేసు దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి సవాల్ చేశారు.స్టేను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ పిటిషనర్ ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా విచారణ చేయాలని హైకోర్టును పిటిషనర్ లాయర్ కోరారు. రేపు (మంగళవారం) విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.