Share News

HighCourt: స్కిల్ కేసులో ఉండవల్లి పిల్‌పై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2023-12-13T12:41:29+05:30 IST

Andhrapradesh: స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

HighCourt: స్కిల్ కేసులో ఉండవల్లి పిల్‌పై విచారణ వాయిదా

అమరావతి: స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కొందరు ప్రతివాదులను నోటిసులు అందలేదని, మరికొందరు నోటిసులు తీసుకొనేందుకు విముఖత చూపుతున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. తదుపరి విచారణలో పేపర్ పబ్లికేషన్ ద్వారా నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-12-13T12:41:30+05:30 IST