Fever: వామ్మో ఇదేమి జ్వరం.. ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే...

ABN , First Publish Date - 2023-09-15T10:47:37+05:30 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కొత్త రకం జ్వరానికి సంబంధించి లక్షణాలు బయటకు కనిపించవని వైద్యులు చెబుతున్నారు.

Fever: వామ్మో ఇదేమి జ్వరం.. ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే...

శ్రీ సత్యసాయి జిల్లా: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub typhus Fever) అనే కొత్త రకం జ్వరం కలకలం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరి మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కొత్త రకం జ్వరానికి సంబంధించి లక్షణాలు బయటకు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. ఈ జ్వరంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలి మరణం సంభవించింది. ధర్మవరం పోతుకుంటకు చెందిన యువకుడు గవ్వల మధు స్క్రబ్ టైఫన్‌ జ్వరంతో మృతిచెందాడు. సాధారణ జ్వరంతో పాటు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా మధు మరణించాడు. జ్వరం కారణంగా మధు పరిస్థితి విషమంగా మారడంతో అనంతపురం నుంచి బెంగుళూర్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొత్త రకం జ్వరంతో సత్య సాయి జిల్లా వైద్య అధికారులు అలెర్ట్ అయ్యారు. బెంగుళూర్ ఆస్పత్రి నివేదికను వైద్యాధికారులు పరిశీలిస్తున్నారు. తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-09-15T10:53:57+05:30 IST