Anantapuram: రాముడు కాలంలోనే లంచం ఉంది: ముర్షావలి
ABN , Publish Date - Dec 24 , 2023 | 11:14 AM
శ్రీ సత్యసాయి జిల్లా: హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలో పాన్ కేక్ తేవడం కోసం సత్యసాయి జిల్లా అధికారులు బెంగళూరుకు వెళ్లారు. మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటన ఖర్చులపై మడకశిర ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా: హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలో పాన్ కేక్ తేవడం కోసం సత్యసాయి జిల్లా అధికారులు బెంగళూరుకు వెళ్లారు. మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటన ఖర్చులపై మడకశిర ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ టెర్రర్ అంట.. ఆమెకు బాత్ రూమ్‌లో గీత ఉండకూడదంట.. బెడ్ రూమ్‌లోకి ఈగ రాకూడదట.. దానికి ఎంత ఖర్చయింటుందో మీరే అర్థం చేసుకోండి.. వాళ్లు తినే ఫుడ్ మడకశిరలో దొరకదు... హిందూపురం నుంచి తెప్పించాం.. వాళ్ల ఫుడ్ మెనూ చూస్తే భయపడిపోతారు.. ఇంత లిస్ట్ వుంది చూడండి.. పాన్ కేక్ ఇక్కడ దొరకదు.. బెంగళూరులో దొరుకుతుంది. అక్కడి నుంచి తెప్పించాం.. ఇంత మెనూ ఇస్తే ఎమ్మార్వో, వీఆర్వో ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి.. అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని అంటారు.. ఇదంతా ఎవడబ్బ సొమ్ము.. ఎవడికి మా బాధ అర్థం కాదు... మేము చెప్తేనే బయటకు తెలుస్తుంది.. రాముడు కాలంలోనే లంచం ఉంది.. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అవినీతికి పాల్పడలేదు.. ఓ మంత్రి మడకశిర పర్యటనకు వస్తే రూ. లక్ష 75 వేలు ఖర్చు అయ్యింది.. ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి రాదు’’ అంటూ ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.