SBI Bank: ఎస్‌బీఐ మేనేజర్ ఘరానా మోసం.. ఏకంగా కోటికి ఎసరు
ABN , First Publish Date - 2023-08-08T13:27:14+05:30 IST
జిల్లాలోని రాయదుర్గం ఎస్‌బీఐ మేనేజర్ ఫణి కుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
అనంతపురం: జిల్లాలోని రాయదుర్గం ఎస్‌బీఐ మేనేజర్ ఫణి కుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఒక కోటి ఆరు లక్షల రూపాయలను కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ఫణి కుమార్ ట్రాన్స్ఫర్ చేసినట్లు ఉన్నతాధికారులు విచారణలో బయటపడింది. ఫణి కుమార్‌పై ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అకౌంట్‌కు ఫోన్ నెంబర్ లింక్, బ్యాంకుకు తరచుగా రాని ఖాతాదారుల అకౌంట్‌లోని నగదుపై కన్నేసిన ఫణి కుమార్.. ఈ మోసానికి తెరలేపాడు. నగదును కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి గోవాతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రబుద్ధుడు జల్సాలు చేశాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలోనూ దాదాపు రూ.20 లక్షలకు పైగా కుటుంబ సభ్యుల అకౌంట్లోకి మేనేజర్ జమ చేసినట్లు గుర్తించారు. ఈసారి ఏకంగా కోటి రూపాయలకు పైగా పలు అకౌంట్లోని నగదును కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ గుర్తించారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు 409, 420, 468, 471, 477-A ఐపీసీ సెక్షన్ల కింద బ్యాంకు మేనేజర్ ఫణికుమార్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.